Sindhu Indonesia Open: రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధుకు అనూహ్య ఓటమి ఎదురైంది. మహిళల సింగిల్స్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఓడి.. ఇండోనేసియా ఓపెన్ సూపర్ 1000 ఈవెంట్ నుంచి నిష్క్రమించింది. చైనాకు చెందిన హీ బింగ్ జియావోతో 14-21, 18-21 తేడాతో వరుస సెట్లలో చిత్తుగా ఓడింది. ప్రపంచ మాజీ ఛాంపియన్ సింధు.. ఈ సీజన్లో రెండు సూపర్ 300 టైటిళ్లు (సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్, స్విస్ ఓపెన్) గెల్చుకున్న సింధు.. ఇండోనేసియా ఓపెన్‌లో మాత్రం తేలిపోయింది.
పురుషుల సింగిల్స్‌లో సాయి ప్రణీత్ కూడా ఆరంభ మ్యాచ్‌లోనే ఓడిపోయాడు. డెన్మార్క్‌కు చెందిన హన్స్ క్రిస్టియన్ సోల్బర్గ్ చేతిలో 21-16, 21-19 తేడాతో ఓడి.. టోర్నీ నుంచి వెనుదిరిగాడు. మిక్స్డ్ డబుల్స్‌లోనూ భారత్‌కు నిరాశే ఎదురైంది. ఇషాన్- తనీష్ క్రాస్టో జోడీ.. హాంకాంగ్‌కు చెందిన చాంగ్ చింగ్- వింగ్ యుంగ్ చేతిలో 14-21, 11-21 తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్ 32 నిమిషాల్లోనే ముగిసింది.
ఇవీ చూడండి: హెడ్‌కోచ్ రమేశ్ పొవార్‌తో గొడవ.. స్పందించిన మిథాలీ రాజ్
చరిత్ర సృష్టించిన తెలుగు కుర్రాడు.. తొలి భారత బాక్సర్‌గా ఆ ఘనత