Thaliand Open: థాయ్లాండ్ ఓపెన్ నుంచి నిష్క్రమించింది భారత స్టార్ షట్లర్ పీవీ సింధు. బ్యాంకాక్ వేదికగా శనివారం జరిగిన సెమీఫైనల్లో చైనాకు చెందిన ఒలింపిక్ ఛాంపియన్ చెన్ యు ఫెయి చేతిలో వరుస సెట్లలో ఓడిపోయింది. 43 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత సింధు.. మూడో సీడ్ చెన్ చేతిలో 17-21, 16-21 తేడాతో ఓటమిపాలైంది.
చివరిసారిగా 2019 బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్లో కూడా చెన్ చేతిలో ఓడింది 26 ఏళ్ల సింధు. ఈ సీజన్లో సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్, స్విస్ ఓపెన్లో రెండు సూపర్ 300 టైటిల్స్ గెలిచింది సింధు. తదుపరి జూన్ 7 నుంచి 12 వరకు జకార్తాలో జరిగే ఇండోనేషియా మాస్టర్స్ 500లో పోటీపడనుంది.
ఇదీ చూడండి: భర్త ప్రోత్సాహం.. ఆమె పట్టుదల.. జాతీయ ఛాంపియన్గా ఎదిగి