ETV Bharat / sports

స్విస్​ ఓపెన్​లో మెరిసిన భారత షట్లర్లు.. టైటిల్​ కైవసం - sathwik sairaj chirag shetty badminton news

స్విట్జర్లాండ్​ వేదికగా ఆదివారం జరిగిన స్విస్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఫైనల్‌లో భారత పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్‌ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి చైనాకు చెందిన రెన్ జియాంగ్ యు, టాన్ కియాంగ్‌ను ఓడించి టైటిల్​ను కైవసం చేసుకున్నారు.

sathwik sairaj rankireddy chirag shetty badminton news
సాత్విక్‌ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి బ్యాడ్​మింటన్​ వార్తలు
author img

By

Published : Mar 26, 2023, 4:21 PM IST

Updated : Mar 26, 2023, 5:43 PM IST

స్విట్జర్లాండ్​ వేదికగా ఆదివారం జరిగిన స్విస్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఫైనల్‌లో భారత పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్‌ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి టైటిల్ గెలుచుకున్నారు. చైనాకు చెందిన రెన్ జియాంగ్ యు, టాన్ కియాంగ్‌ను వారు ఓడించారు.
2022లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకంతో సరిపెట్టుకున్న ఈ జోడీ రెండో సీడ్ డిఫెన్స్‌లో పటిష్ఠంగా ఉండి 54 నిమిషాల్లో 21-19, 24-22తో ప్రపంచ నం. 21 జోడీని ఓడించి భారత్​ను విజయపథంలోకి నడిపించింది.

వీరిద్దరి కెరీర్​లో ఇది ఐదవ టైటిల్​. 2019లో థాయ్‌లాండ్ ఓపెన్​తో పాటు 2018లో హైదరాబాద్ ఓపెన్‌లోనూ గెలుపొందిన ఈ షట్లర్​ జోడీ గత ఏడాది ఇండియా ఓపెన్​తో పాటు ఫ్రెంచ్ ఓపెన్‌ల్లోనూ తమ సత్తా చాటి టైటిల్​ను గెలుచుకుంది. 68 ఏళ్ల స్విస్ ఓపెన్ హిస్టరీలో భారత్ కైవసం చేసుకున్న మొదటి డబుల్స్ టైటిల్ ఇదే కావడం విశేషం.

1955లో ప్రారంభమైనప్పటి నుంచి స్విస్ ఓపెన్ సూపర్ 300 సిరీస్‌లో భారత జట్టు ఇప్పటిదాకా డబుల్స్‌లో ఒక్క టైటిల్​ను కూడా సొంతం చేసుకోలేదు. అయితే 2011-12 సీజన్లలో ఉమెన్స్ సింగిల్స్‌లో విజేతగా నిలిచిన సైనా నెహ్వాల్.. స్విస్ ఓపెన్ గెలిచిన మొట్టమొదటి భారత బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా రికార్డు సృష్టించింది. ఇక 2015లో కిడాంబి శ్రీకాంత్, 2016లో హెచ్​ ఎస్​ ప్రణయ్ పురుషుల సింగిల్స్ విభాగంలో స్విస్ ఓపెన్ టైటిల్స్​ను సొంతం చేసుకున్నారు.

మరోవైపు 2018లో సమీర్ వర్మ కూడా స్విస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విభాగంలో స్విస్ ఓపెన్ టైటిల్​ను గెలవగా.. 2022 లో పీవీ సింధు, మొట్టమొదటిసారిగా ఈ టైటిల్‌ని తన ఖాతాలో వేసుకుంది. అయితే డబుల్స్​లో టైటిల్​ గెలుచుకోని లోటును సాత్విక్ సాయిరాజ్ రాంకీరెడ్డి- చిరాగ్ శెట్టి జోడీ తీర్చింది. ఇక ఈ ఓపెన్ టోర్నీలో మూడు పురుషుల సింగిల్స్, మూడు ఉమెన్స్​ సింగిల్స్​తో పాటు ఓ పురుషుల డబుల్స్ టైటిల్‌ని గెలిచిన భారత్.. ఈ గెలుపుతో అత్యధిక పతకాలు గెలిచిన టీమ్స్​ జాబితాలో 11వ స్థానానికి ఎగబాకింది.

2023 స్విస్ ఓపెన్‌లో పురుషుల సింగిల్స్ విభాగానికి చెందిన టీమ్​ఇండియా నుంచి బరిలో దిగిన హెచ్​ ఎస్​ ప్రణయ్ రెండో రౌండ్‌లో నిష్కమించగా.. మరో స్టార్​ ప్లేయర్​ లక్ష్యసేన్​ కూడా తొలి రౌండ్‌లోనే ఓడి ఇంటి దారి పట్టాడు. మరోవైపు కిరణ్ జార్జ్ తొలి రౌండ్‌లోనే ఓటమి పాలవ్వగా కిడాంబి శ్రీకాంత్ రెండో రౌండ్‌లో పరాజయాన్ని చవి చూశాడు. ఇక మిథున్ మంజునాథ్ రెండో రౌండ్​లో పెవిలియన్​కు చేరుకున్నాడు.

Last Updated : Mar 26, 2023, 5:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.