ETV Bharat / sports

ఒక్క అడుగు దూరంలో సానియా మీర్జా.. గెలిస్తే.. - రోహన్​ బోపన్న లేటెస్ట్ న్యూస్​

ఆస్ట్రేలియన్​ ఓపెన్​ మిక్స్​డ్​ డబుల్స్​లో టెన్నిస్​ స్టార్​ సానియా మీర్జా అదరగొడుతోంది. బుధవారం జరిగిన సెమీఫైనల్స్​లో బ్రిటన్​ టీమ్​ను ఓడించిన ఈ స్టార్​ ప్లేయర్​ ఇప్పుడు గ్రాండ్​ స్లామ్​ను కైవశం చేసుకునేందుకు అడుగు దూరంలో ఉంది.

sania and rohan
sania and rohan
author img

By

Published : Jan 25, 2023, 4:33 PM IST

తన కెరీర్‌ చివరి గ్రాండ్‌స్లామ్​ను ఆడుతున్న టెన్నిస్​ స్టార్​ సానియా మీర్జా బుధవారం జరిగిన సెమీ ఫైనల్స్​లో కో ప్లేయర్​ రోహన్ బోపన్నతో కలిసి బ్రిటన్​ జోడీని చిత్తుగా ఓడించింది. దీంతో ఈ జంట ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్‌కు అర్హత సాధించింది. అలా ఫైనల్స్​తో తన ఏడో మేజర్ టైటిల్‌ను గెలుచుకునే అవకాశాన్ని సంపాదించుకుంది సానియా.

సుమారు 1 గంట 52 నిమిషాల పాటు సాగిన ఈ సెమీఫైనల్‌ మ్యాచ్​లో అన్‌సీడెడ్‌ భారత జోడీ 7-6(5) 6-7(5) 10-6తో మూడో సీడ్‌ డెసిరే క్రావ్‌జిక్‌, నీల్‌ స్కుప్‌స్కీ జోడీని సానియా బోపన్న జోడీ మట్టి కరిపించింది. కాగా సానియా తన కెరీర్‌లో మూడు మహిళల డబుల్స్​తో పాటు అనేక మిక్స్‌డ్ డబుల్స్ టైటిళ్లను గెలుచుకుంది. మరోవైపు బోపన్న ఒక మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను గెలుచుకున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.