కరోనా మహమ్మారి కారణంగా మూతపడిన భారత క్రీడాప్రాధికార సంస్థ (సాయ్) శిక్షణా కేంద్రాలు మళ్లీ తెరుచుకున్నాయి. నవంబరు ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఉన్న సాయ్ శిక్షణా కేంద్రాలు క్రీడాకారులకు అందుబాటులోకి రానున్నాయి. వచ్చే ఏడాది టోక్యో ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సాయ్ తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించింది.
"టోక్యో ఒలింపిక్స్, పారాలింపిక్స్‌ను దృష్టిలో పెట్టుకుని దేశవ్యాప్తంగా ఉన్న సాయ్ కేంద్రాల్లో నవంబరు 1 నుంచి శిక్షణ ప్రారంభించాలని నిర్ణయించాం. కరోనా మహమ్మారి నుంచి క్రీడాకారులను సురక్షితంగా ఉంచే ప్రక్రియలో భాగంగా వారికి ప్రయాణ వసతి కల్పించనున్నాం. 500 కి.మీ. కంటే తక్కువ దూరంలో ఉన్నవాళ్లకు రైలు (థర్డ్ ఏసీ) వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తాం" అని సాయ్ పేర్కొంది.