ETV Bharat / sports

ఐదుగురు ఒలింపిక్ స్టార్స్​కు ప్రమోషన్లు - SAI GB meeting

ఒలింపిక్స్​(olympics 2020)లో సత్తాచాటిన పలువురు క్రీడాకారులకు ప్రమోషన్లు లభించాయి. దీనికి సంబంధించి సాయ్ 55వ పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

olympics
ఒలింపిక్
author img

By

Published : Sep 28, 2021, 5:44 PM IST

మహిళా హాకీ టీమ్ కెప్టెన్ రాణి రాంపాల్, గోల్ కీపర్ సవితా పునియాతో పాటు పారాలింపిక్స్​లో పతకాలు గెలిచిన మరియప్పన్ తంగవేలు, శరద్ కుమార్​లకు ప్రమోషన్లు లభించాయి. వీరితో పాటు ఒలింపిక్స్​లో మహిళా హాకీ జట్టు కోచ్​ బృందంలో ఉన్న పీయూష్ దూబేకూ ప్రమోషన్​ ఆఫర్ వచ్చింది. ఒలింపిక్స్​(olympics 2020)లో సత్తాచాటిన వీరికి చేయూతనందించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. సాయ్ 55వ పాలక మండలి సమావేశంలో ఈ అంశంపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు మరికొన్ని నిర్ణయాలు ఇలా ఉన్నాయి.

  • ఇటీవల లివర్ కేన్సర్​తో మరణించిన బాక్సర్ డింగో సింగ్​ కుటుంబానికి ఆర్థిక చేయూతనందిస్తున్నట్లు సాయ్ ప్రకటించింది. ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు 6.87 లక్షలు అందిస్తున్నట్లు వెల్లడించింది.
  • ఇక ప్రమోషన్ల విషయానికి వస్తే.. హాకీ గోల్ కీపర్ సవితను అసిస్టెంట్ కోచ్​ నుంచి కోచ్​గా, మహిళా హాకీ జట్టు కెప్టెన్​ రాణి రాంపాల్, ప్రవీణ్ దూబేలను సీనియర్ కోచ్​లగా ప్రమోట్ చేశారు. పారాలింపిక్స్​లో రెండోసారి పతకం సాధించిన హైజంపర్ మరియప్పన్​కు చీఫ్ కోచ్ నుంచి సీనియర్ కోచ్​గా, శరద్ కుమార్​కు అసిస్టెంట్ కోచ్​ నుంచి కోచ్​గా బాధ్యతలు అప్పగించారు.
  • 2024, 2028 ఒలింపిక్స్​ను దృష్టిలో పెట్టుకుని సాయ్​, టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (TOPS)ను మరింత బలోపేతం చేసేందుకు ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించారు. అందుకోసం పలు పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.
  • స్పోర్ట్స్ సైన్స్ అనుభవజ్ఞులు, హై పర్ఫామెన్స్ కోచ్​లతో పాటు మరికొందరు ప్రొఫెషనల్స్​ను సాయ్​ నియమించనుంది.
  • సైంటిఫిక్ స్టాఫ్​లో 300 అదనపు పోస్టులకు సాయ్ అనుమతినిచ్చింది. ఇందులో హై పర్ఫామెన్స్ అనలిస్ట్ (138), హై పర్ఫామెన్స్ డైరెక్టర్స్ (23), స్పోర్ట్స్ మెడిసిన్ డాక్టర్స్ (23), ఫిజియోథెరపిస్ట్ (93), మసాజర్స్ (104) వంటి పోస్టులు ఉన్నాయి.
  • ఈ పోస్టులతో పాటు అదనంగా హై పర్ఫామెన్స్ అనలిస్టులు అనగా స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్​, స్పోర్ట్స్ పర్ఫామెన్స్ అనలిస్ట్, బయోమెకానిస్ట్, సైకాలజిస్ట్, వీడియో అనలిస్ట్, ఫిజియాలజిస్ట్​లను నియమించనుంది.
  • వీటితో పాటు 50 మంది హై పర్ఫామెన్స్ కోచ్​లను అదనంగా నియమించనుంది సాయ్.​

ఇవీ చూడండి:రకా ముంబయి ఒక్క మ్యాచ్​ ఓడినా ఆశలు గల్లంతే!

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.