ETV Bharat / sports

టెన్నిస్‌ స్టార్‌ రఫేల్‌ నాదల్​కు నిరాశ.. 18ఏళ్ల తర్వాత కెరీర్​లో తొలిసారి ఇలా.. - రఫేల్ నాదల్​ టాప్ 10 ర్యాంకింగ్స్

స్పెయిన్‌ బుల్‌ టెన్నిస్‌ స్టార్‌ రఫేల్‌ నాదల్​కు తీవ్ర నిరాశ ఎదురైంది. కెరీర్​లో 18 ఏళ్ల తర్వాత టాప్‌-10 ర్యాంకింగ్స్‌ నుంచి కిందకు పడిపోయాడు.

rafael nadal rankings
టెన్నిస్‌ స్టార్‌ రఫేల్‌ నాదల్​కు నిరాశ.. 18ఏళ్ల తర్వాత కెరీర్​లో తొలిసారి ఇలా..
author img

By

Published : Mar 21, 2023, 5:34 PM IST

Updated : Mar 21, 2023, 5:54 PM IST

స్పెయిన్‌ బుల్‌ టెన్నిస్‌ స్టార్‌ రఫేల్‌ నాదల్​కు నిరాశ ఎదురైంది. దాదాపు 18 ఏళ్ల తర్వాత టాప్‌-10 ర్యాంకింగ్స్‌ నుంచి కిందకు పడిపోయాడు. గాయం కారణంగా జనవరి నుంచి ఆటకు దూరమైన అతడు.. క్రమక్రమంగా ర్యాంకింగ్స్‌లో కిందకి పడిపోతూ వచ్చాడు. అయితే తాజాగా.. ఇండియన్‌ వెల్స్‌ టెన్నిస్‌ టోర్నీ ముగిసిన తర్వాత టెన్నిస్ ర్యాంకింగ్స్​ను విడుదల చేశారు. ఇందులో నాదల్‌ 13వ స్థానంలో నిలిచాడు. అయితే 2005లో తొలిసారి టెన్నిస్‌ ర్యాంకింగ్స్​లో టాప్‌-10లోకి దూసుకెళ్లాడు నాదల్. ​అప్పటినుంచి 18 ఏళ్ల పాటు టాప్‌-10లోనే కొనసాగుతూ రికార్డు సృష్టించాడు. గతంలోనూ 209 వారాల పాటు, ఐదు సార్లు నెంబర్‌ వన్‌గా నిలిచి చరిత్ర సృష్టించాడు. నాదల్‌ తర్వాత జిమ్మీ కానర్స్‌ పదిహేనేళ్ల ఏళ్ల పాటు టాప్‌-10లో నిలిచాడు.

కాగా, ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో రెండో రౌండ్‌లోనే వెనుదిరిగిన నాదల్‌.. ఆ తర్వాత తుంటి గాయం బారిన పడ్డాడు. అనంతరం గాయం నుంచి నుంచి కోలుకున్న అతడు.. వచ్చే నెలలో జరగనున్న మాంటే కార్లో టెన్నిస్‌ టోర్నమెంట్‌లో ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే ఈ టోర్నీలో అతడికి మంచి రికార్డే ఉంది. ఇప్పటివరకు 11సార్లు మాంటే కార్లో టైటిల్​ను ముద్దాడాడు. ఓపెన్‌ శకంలో 2005 నుంచి 2012 వరకు వరుసగా ఎనిమిది సార్లు టైటిల్​ను ముద్దాడి రికార్డు సృష్టించాడు. మొత్తంగా నాదల్‌ కెరీర్​లో.. 22 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ను గెలుపొందింది జకోవిచ్​తో సంయుక్తంగా కొనసాగుతున్నాడు.

ఇక తాజాగా ముగిసిన ఇండియన్‌ వెల్స్‌ టోర్నీ విషయానికొస్తే.. స్పెయిన్‌ యువ సంచలనం కార్లోస్‌ అల్కరాజ్‌ విజేతగా నిలిచాడు. ఈ మెగా టోర్నీలో తొలిసారి విజేతగా నిలిచి.. ప్రపంచ టెన్నిస్‌ ర్యాంకింగ్స్‌లో నెంబర్‌వన్‌గా అవతరించాడు. పురుషుల సింగిల్స్‌ ఫైనల్​లో టాప్‌ సీడైన అల్‌కరాజ్‌ 6-3, 6-2తో ప్రపంచ ఐదో ర్యాంకర్‌ డానిల్‌ మెద్వెదెవ్‌(రష్యా)పై విజయం సాధించాడు. ఇకపోతే ఈ టోర్నీకి ముందు సెర్బియా స్టార్‌ ప్లేయర్​ జకోవిచ్‌ ర్యాంకింగ్స్​లో టాప్​లో నిలిచాడు. అయితే కరోనా టీకా వేసుకోని విదేశీయులకు అమెరికాలో ప్రవేశం లేకపోవడం వల్ల జకోవిచ్​ ఇండియన్ వెల్స్​ టోర్నీకి దూరమయ్యాడు. దీంతో అతడు 7,160 పాయింట్లతో రెండో ర్యాంక్‌కు పడిపోయాడు. అయితే సోమవారం మయామి ఓపెన్ టోర్నీ మొదలైంది. ఇందులోనూ అల్​కరాజ్​ గెలిస్తేనే నెంబర్​ వన్​ ర్యాంకులో కొనసాగుతాడు. లేదంటే ఏప్రిల్​ 3న రిలీజ్​ చేసే కొత్త ర్యాంకింగ్స్​లో మళ్లీ జకోవిచ్​నే అగ్రస్థానంలో నిలుస్తాడు.

ఇదీ చూడండి: టీమ్​ఇండియాలో నో ఛాన్స్​.. ఇక సీరియల్​లో గబ్బర్​ సింగ్​గా శిఖర్​ ధావన్​!

Last Updated : Mar 21, 2023, 5:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.