ETV Bharat / sports

సయ్యద్​ మోదీ టోర్నీ​ విజేతగా పీవీ సింధు

author img

By

Published : Jan 23, 2022, 3:45 PM IST

Updated : Jan 23, 2022, 5:22 PM IST

PV Sindhu wins Syed modi international tournament: భారత స్టార్‌ షట్లర్ పీవీ సింధు సయ్యద్ మోదీ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీని​​ గెలుచుకుంది. మహిళ సింగిల్స్‌ ఫైనల్లో భారత్‌కే చెందిన మాల్‌వికా బన్‌సోద్‌తో తలపడిన సింధు విజయం సాధించింది. 35 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో 21-13, 21-16 తో విజయాన్ని అందుకుంది.

pv sindhu
పీవీ సింధు

PV Sindhu wins Syed modi international tournament: కొంతకాలంగా ఊహించని ఓటములతో, టైటిళ్లను సొంతం చేసుకోలేక సతమతమవుతున్న భారత స్టార్​ షట్లర్​ పీవీ సింధు ఎట్టకేలకు మళ్లీ ఫామ్​లోకి వచ్చింది. అంతర్జాతీయ స్థాయిలో తన టైటిళ్ల కరవుకు తెరదించింది. నేడు(జనవరి 23) సయ్యద్​ మోదీ అంతర్జాతీయ టోర్న్​ మెంట్​లో భాగంగా జరిగిన మహిళ సింగిల్స్‌ ​ఫైనల్​లో సత్తాచాటి ఈ ఏడాదిని గొప్పగా ఆరంభించింది.

ఈ పోరులో భారత్‌కే చెందిన మాల్‌వికా బన్‌సోద్‌తో తలపడిన సింధు.. 21-13,21-16 తేడాతో పూర్తి ఆధిపత్యం చెలాయించి చివరకు విజయ దుందుభి మోగించింది. ఈ మ్యాచ్​ 35 నిమిషాల పాటు సాగింది.

సింధుకు ఇది రెండో సయ్యద్ మోదీ ట్రోఫీ. మొదట 2017లో ఈ టైటిట్‌ చేజిక్కించుకుంది. 2019లో గ్లాస్గోలో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించిన తర్వాత.. మరే అంతర్జాతీయ పోరులోనూ సింధుకు టైటిల్‌ దక్కలేదు. సింధు గతేడాది వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో రన్నరప్‌గా నిలిచింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగింది. దాదాపు రెండేళ్ల తర్వాత సింధుకు ఇదే మొదటి టైటిల్.

మిక్స్​డ్​ డబుల్స్​
మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఫైనల్​లో ఇషాన్‌- తనీషా జోడీ విజయం సాధించి టైటిల్​ను దక్కించుకుంది. 29 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో 21-16, 21-12 తేడాతో నాగేంద్ర- శ్రీవేద్య ద్వయంను ఓడించారు.

ఇదీ చూడండి:

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

'టీ20 ప్లేయర్​ ఆఫ్​ ది ఇయర్​'గా పాక్​ క్రికెటర్​

Last Updated : Jan 23, 2022, 5:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.