ETV Bharat / sports

నీరజ్​కు మోదీ ఫోన్​.. ఏమన్నారంటే? - టోక్యో ఒలింపిక్స్

టోక్యో ఒలింపిక్స్​లో స్వర్ణం సాధించిన జావెలిన్ త్రో ఆటగాడు నీరజ్ చోప్డాకు ప్రధాని నరేంద్ర మోదీ.. ఫోన్​ చేసి శుభాకాంక్షలు తెలిపారు. చోప్డా కఠోర శ్రమను, దృఢ సంకల్పాన్ని కొనియాడారు. ఈ మేరకు ట్వీట్ చేశారు ప్రధాని.

మోదీ
Modi
author img

By

Published : Aug 7, 2021, 9:19 PM IST

టోక్యో ఒలింపిక్స్​.. జావెలిన్​ త్రో ఫైనల్లో స్వర్ణం సాధించి అథ్లెటిక్స్​లో 100 ఏళ్ల కలను సాకారం చేశాడు నీరజ్​ చోప్డా. ఈ మేరకు నీరజ్​కు ప్రధాని నరేంద్ర మోదీ.. ఫోన్​ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

" ఇప్పుడే నీరజ్ చోప్డాతో ఫోన్​లో మాట్లాడాను. ఒలింపిక్స్​లో స్వర్ణం సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపాను. తనకున్న స్పోర్ట్స్ టాలెంట్​ను నిరూపించాడు చోప్రా. ఆటగాడికి ఉండాల్సిన క్రీడాస్ఫూర్తి నీరజ్​ సొంతం. అతని భవిష్యత్తుకు బెస్ట్ విషెస్​."

-- ప్రధాని మోదీ ట్వీట్

మూడు రోజుల క్రితం జరిగిన క్వాలిఫికేషన్‌లోనే 86.59 మీటర్ల త్రోతో ఫైనల్​కు అర్హత సాధించాడు. అయితే ఫైనల్స్​లో ఆ మార్కును దాటాడు.

ఫైనల్లో తొలి ప్రయత్నంలోనే 87.03 మీటర్లు దూరం విసిరిన నీరజ్​.. మరో రౌండ్​లో 87.58 మీటర్ల దూరం బల్లెం విసిరి పతకం ఖరారు చేశాడు. దీంతో.. ఏ దశలోనూ అతడికి పోటీ లేకుండా పోయింది.

ఇవీ చదవండి:

Olympics: చరిత్ర సృష్టించిన నీరజ్​ చోప్రా- భారత్​కు స్వర్ణం

'ఈ స్వర్ణ పతకం మిల్కాసింగ్​కు అంకితం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.