ETV Bharat / sports

'130కోట్ల భారతీయుల తరఫున వారికి శుభాకాంక్షలు'

author img

By

Published : Jul 9, 2021, 11:41 AM IST

Updated : Jul 9, 2021, 2:25 PM IST

టోక్యో ఒలింపిక్స్​ కోసం భారత బృందం సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఒలింపిక్స్​కు వెళ్లే అథ్లెట్లతో ఈ నెల 13న భేటీ కానున్నట్లు తెలిపారు.

PM Modi
టోక్యో ఒలింపిక్స్

టోక్యో ఒలింపిక్స్​ కోసం భారత్​ నుంచి మొదటి బృందం జపాన్ వెళ్లనున్న నేపథ్యంలో వారికి కల్పించిన సదుపాయాలపై శుక్రవారం సమీక్షించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అథ్లెట్లకు రవాణా, వైద్య సౌకర్యాలు సహా టీకా వివరాలపై చర్చించినట్లు ట్విట్టర్​లో వెల్లడించారు. వారితో జులై 13న సాయంత్రం 5 గంటలకు భేటీ కానున్నట్లు తెలిపారు.

Tokyo Olympics
వర్చువల్​గా సమీక్షిస్తున్న ప్రధాని

2020 టోక్యో కోసం భారత బృందం సన్నద్ధతపై సమీక్షించాను. ఒలింపిక్స్​లో పాల్గొనే అథ్లెట్లతో జులై 13న సమావేశమవుతాను. 130 కోట్ల మంది భారతీయుల తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా.

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

ఎయిర్​ ఇండియా ప్రత్యేక విమానంలో జులై 17న టోక్యో బయలుదేరనుంది భారత బృందం. ఈ నేపథ్యంలో అథ్లెట్లను ఉత్సాహపరచాలని ప్రజలను కోరారు మోదీ.

Tokyo Olympics
ప్రధాని మోదీ ట్వీట్

ఇప్పటికే 120 మందికి పైగా భారత అథ్లెట్లు ఒలింపిక్స్​కు అర్హత సాధించారు. జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు ఈ మెగా ఈవెంట్ జరగనుంది.

ఇదీ చూడండి: Olympics: ప్రేక్షకులు లేకుండానే ఒలింపిక్స్​

Last Updated : Jul 9, 2021, 2:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.