ETV Bharat / sports

దేశఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారంటూ పారా క్రీడాకారులపై మోదీ ప్రశంసలు - పారా క్రీడాకారులను కలిసిన ప్రధాని మోదీ

PM Modi Meets Para Athletes : ఇటీవల ముగిసిన పారా ఆసియా గేమ్స్​లో సత్తా చాటిని క్రీడాకారులను భారత ప్రధాని నరేంద్ర మోదీ కలిశారు. ఈ సందర్భంగా పారా ఆటగాళ్ల అంకితభావాన్ని కొనియాడారు.వారు దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారని ప్రశంసల వర్షం కురపించారు.

PM Modi Meets Para Athletes
PM Modi Meets Para Athletes
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 1, 2023, 7:46 PM IST

Updated : Nov 1, 2023, 8:35 PM IST

PM Modi Meets Para Athletes : చైనా వేదికగా జరిగిన పారా ఆసియా గేమ్స్‌లో సత్తా చాటి.. పతకాలు సాధించిన ఆటగాళ్లను మోదీ కలిసి.. అభినందించారు. కేంద్ర క్రీడాశాఖమంత్రి అనురాగ్‌ఠాకూర్‌తో కలిసి అథ్లెట్లను కలిసిన ప్రధాని.. వారి విజయ ప్రస్థానాన్ని అడిగి తెలుసుకున్నారు. చాలామంది ఆటగాళ్లకు మోదీ ఆటోగ్రాఫ్‌ ఇవ్వగా.. మరికొందరితో మోదీ ఫొటోలు దిగారు. కొందరు అథ్లెట్లు మోదీకి.. బహుమతులను ఇచ్చారు. గతంలో ఎన్నడూలేని విధంగా భారత్‌ ఈ సారి పారా ఆసియా గేమ్స్‌లో 111 పతకాలు (Para Asian Games 2023 Medal Tally India) సాధించి.. సత్తా చాటింది. పారా ఆటగాళ్ల అంకితభావాన్ని కొనియాడిన ప్రధాని.. వారు దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారని కొనియాడారు.

"క్రీడల్లో ఓటమి ఉండదు. గెలవడం లేదా నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది. మీ (పారా అథ్లెట్లు) విజయం యావత్​ దేశానికి స్ఫూర్తినిస్తుంది. దేశ ప్రజల గర్వంగా ఫీల్ అయ్యేలా చేస్తుంది. ఈ రోజుల్లో క్రీడలను కూడా వృత్తిగా అంగీకరిస్తున్నారు. పారా అథ్లెట్లు క్రీడల్లో సాధించిన విజయం క్రీడల్లో మాత్రమే స్ఫూర్తిదాయకం కాదు. అది అందరి జీవితాల్లో కూడా స్ఫూర్తిదాయకమే. 'ప్రభుత్వం కోసం క్రీడాకారులు' అనేది మునుపటి విధానం. ఇప్పుడు అది 'అథ్లెట్ల కోసం ప్రభుత్వం'గా మారింది. అథ్లెట్లు కేంద్రంగా ప్రస్తుత ప్రభుత్వం విధానం ఉంది. క్రీడాకారుల్లో ఉన్న పొటెన్షియల్​, ఫ్లాట్​ఫామ్​ కలిస్తే.. పెర్ఫామెన్స్​తో సమానం. అయితే పొటెన్షియల్​కు సరైన ప్లాట్​ఫామ్​ లభిస్తే పర్ఫామెన్స్ ఊపందుకుంటుంది. ప్రతి టోర్నమెంట్​లో మీరు సాధించే విజయం.. మానవ కలల గెలుపు"
-- నరేంద్ర మోదీ, భారత ప్రధాని

  • Elated to interact with the Indian athletes who displayed their remarkable talent at the Asian Para Games. Their achievements underscore their dedication and extraordinary skills. https://t.co/DB8wNNkRXB

    — Narendra Modi (@narendramodi) November 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అయితే గతంలో కన్నా ఈసారి పారా అథ్లెట్లు రికార్డ్​ బ్రేకింగ్​ పతకాలు గెలిచారన్న మోదీ.. క్రీడల్లో షార్ట్​కట్​లు ఉండవన్నారు. క్రీడాకారులు వారి సామర్థ్యాలపై మాత్రమే ఆధారపడతారని.. కానీ ఓ చిన్న సాయం మల్టిప్లైయర్​ ఎఫెక్ట్​గా ఉపయోగపడుతుందన్నారు. అలాంటి వారికి కుటుంబ సభ్యులు, సమాజం, సంస్థలు కలిసికట్టుగా మద్దతు తెలపాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. అంతేకాకుండా కుటుంబాల్లో క్రీడల పట్ల ఉన్న దృక్పథాన్ని మార్చాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర యువజన, క్రీడా వ్యవహారాల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్, సహాయమంత్రి నిసిత్ ప్రమాణిక్​, భారత పారాలింపిక్స్ కమిటీ అధ్యక్షురాలు దీపా మాలిక్. కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ ముండా పాల్గొన్నారు.

ఆటతీరు బాగోలేదని చెప్పి సూర్యకుమార్​కు షాకిచ్చిన అభిమాని

వాంఖడేలో 22 అడుగుల సచిన్​ విగ్రహం భావోద్వేగానికి లోనైన క్రికెట్ గాడ్​

Last Updated : Nov 1, 2023, 8:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.