ఒలింపిక్స్‌లో పతకాలు సాధించే తమ రాష్ట్ర అథ్లెట్లకు భారీగా ప్రోత్సాహకాలు ప్రకటించారు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్. స్వర్ణపతక విజేతకు రూ.6 కోట్లు, రజతానికి రూ.4 కోట్లు, కాంస్యానికి రూ.2.5 కోట్లు నగదు ప్రోత్సాహకం అందించనున్నట్లు తెలిపారు. తమ రాష్ట్రం నుంచి ఈ మెగాక్రీడలకు వెళ్లే ప్రతి క్రీడాకారుడికి రూ.15 లక్షలు నగదు ఇస్తామని పేర్కొన్నారు.
తమ రాష్ట్రం నుంచి ఒలింపిక్స్‌లో పాల్గొననున్న అథ్లెట్లు ద్యుతి చంద్, ప్రమోద్ భగత్, దీప్ గ్రేస్ ఎక్కా, నమితా టొప్పొ, బిరేంద్ర లక్రా, అమిత్ రోహిదాస్‌ను ప్రశంసించారు పట్నాయక్. వీరంతా తమ రాష్ట్ర యువతకు రోల్ మోడల్‌గా నిలిచారని అన్నారు. వీరంతా పతకాలు సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: