ETV Bharat / sports

Para Asian Games 2023 : పారా ఆసియా క్రీడల్లో తెలుగు తేజాలు అదరహో.. భారత్ ఖాతాలో పసిడి జాతర!

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 25, 2023, 7:09 AM IST

Para Asian Games 2023 India Medal Tally : పారా ఆసియా క్రీడల్లో భారత్‌ దూకుడు ప్రదర్శిస్తోంది. రెండు రోజుల వ్యవధిలో 34 పతకాలు.. 9 స్వర్ణాలు, 12 రజతాలు, 13 కాంస్యాలు ఖాతాలో వచ్చేశాయి. తెలుగుతేజాలు దీప్తి స్వర్ణం, రవి రజతం సాధించారు. ఒక్క అథ్లెటిక్స్‌లోనే భారత్‌ 6 స్వర్ణాలతో పాటు 18 పతకాలు గెలిచింది. మరిన్ని పతకాలు కూడా వచ్చాయి. ఆ వివరాలు..

Para Asian Games 2023 : పారా ఆసియా క్రీడల్లో తెలుగు తేజాలు అదరహో.. పసిడి జాతర

Para Asian Games 2023 India Medal Tally : ఆసియా క్రీడల్లో భారత్‌ పతకాల వెల్లువ కొనసాగుతోంది. మొదటి రోజు, సోమవారం 6 గోల్డ్​మెడల్స్​తో పాటు 17 పతకాలు.. రెండో రోజు మంగళవారం 3 స్వర్ణాలు సహా 17 పతకాలు ఖాతాలోకి వచ్చాయి. మెడల్స్​ టేబుల్​లో భారత్‌ ఐదో స్థానంలో ఉంది.

షాట్​పుట్​లో రవి.. షాట్‌పుట్‌లో ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్​ రవి రొంగలి సిల్వర్​మెడల్​ను ముద్దాడాడు. ఎఫ్‌-40 విభాగంలో అతడు గుండును 9.92 మీటర్లు విసిరి రెండో స్థానంలో నిలిచాడు. రాంపాల్‌ (హైజంప్‌), అజయ్‌కుమార్‌ (400 మీ), ప్రమోద్‌ (1500 మీ), రుద్రాంశ్‌ ఖండేవాల్‌ (10 మీటర్ల పిస్టల్‌), సిమ్రన్‌శర్మ (మహిళల 100 మీ), ధరమ్‌వీర్‌ (క్లబ్‌త్రో), యోగేశ్‌ (డిస్కస్‌త్రో), కపిల్‌ పర్మర్‌ (జూడో, 60 కేజీ) సిల్వర్ మెడల్స్​ దక్కించుకున్నారు.

భార్య - భర్త ఇద్దరూ.. కనోయింగ్‌లో ప్రాచి యాదవ్‌.. రెండు విభాగాల్లో గోల్డ్​ మెడల్​తో పాటు సిల్వర్​ మెడల్​ను కూడా దక్కించుకుంది. కేఎల్‌-2 విభాగంలో 54.96 సెకన్లలో లక్ష్యాన్ని చేరి స్వర్ణాన్ని అందుకున్న ఆమె.. వీఎల్‌-2లో 1 నిమిషం 13.14 సెకన్లలో రేసు కంప్లీట్​ చేసి రెండో స్థానంలో నిలిచింది. ఇక పురుషుల కేఎల్‌-3లో ప్రాచి భర్త మనీశ్‌ కౌరవ్‌ బ్రాంజ్​ మెడల్ దక్కించుకున్నాడు. అతడు 44.60 సెకన్లలో లక్ష్యాన్ని చేరి మూడో స్థానంలో నిలిచాడు.

పసిడి పట్టేసిన అవని.. టోక్యో పారాలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన అవని లేఖరా.. ఆసియా పారా క్రీడల్లోనూ స్వర్ణ పతకాన్ని అందుకుంది. మహిళల 10 మీటర్ల ఎయిర్‌రైఫిల్‌లో ఆమె 249.6 పాయింట్లతో గోల్డ్​ మెడల్​ను దక్కించుకుంది. హైజంప్‌ టీ63 కేటగిరిలో మూడు మెడల్స్​ భారత్‌ ఖాతాలోనే పడ్డాయి. శైలేశ్‌కుమార్‌ (1.82 మీటర్లు) స్వర్ణాన్ని ముద్దాడగా.. తంగవేలు (1.80 మీ) సిల్వర్ మెడల్​, రామ్‌సింగ్‌ (1.79 మీ) బ్రాంజ్ మెడల్​ దక్కించుకున్నారు. నిషధ్‌ కుమార్‌ (హైజంప్‌ టీ47), శైలేశ్‌కుమార్‌ (హైజంప్‌, టీ63), అంకుర్‌ దామా (5 వేల మీ), ప్రవీణ్‌కుమార్‌ (హైజంప్‌, టీ64), ప్రణవ్‌ సూర్మా (క్లబ్‌త్రో), శంకరప్ప శరత్‌ (5000 మీటర్లు), నీరజ్‌ యాదవ్‌ (డిస్కస్‌త్రో) గోల్డ్ మెడల్స్​ను దక్కించుకున్నారు.

దీప్తి డబుల్ రికార్డ్ బ్రేక్​..​ తెలంగాణ రాష్ట్రానికి చెందిన అథ్లెట్‌ జీవాంజి దీప్తి పారా ఆసియా క్రీడల్లో మంచి ప్రదర్శన చేసింది. అదరగొట్టింది. టీ20 మహిళల 400 మీటర్ల పరుగులో ఆసియా క్రీడలు, పారా ఆసియా క్రీడల రికార్డును బ్రేక్ చేసింది. 56.69 సెకన్లలో పరుగులు పూర్తిచేసి గోల్డ్​ మెడల్​ దక్కించుకుంది. కానో నినా (59.73 సె- జపాన్‌), కైసింగ్‌ (59 సె- థాయ్‌లాండ్‌) సిల్వర్​, బ్రాంజ్​ నెగ్గారు.

  • India's Gold Rush Continues at #AsianParaGames! 🥇🇮🇳

    Deepthi Jeevanji clinches another gold for India in the Women's 400m-T20, setting a new Asian Para Record and Games Record with a blazing time of 56.69! 💪✌️🏆

    Congratulations to Deepthi for soaring to new heights and making… pic.twitter.com/TGTbygcvvC

    — SAI Media (@Media_SAI) October 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

2024 పారిస్‌ పారా ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన దీప్తి.. ఆసియా క్రీడలు (58.55 సెకన్లు), పారా ఆసియా క్రీడలు (58.69 సెకన్లు) రికార్డులను అధిగమించింది. వరంగల్‌ జిల్లా కల్లెడ గ్రామానికి చెందిన అమ్మాయి దీప్తి. ఈమె నాగపురి రమేశ్‌ దగ్గర శిక్షణ తీసుకుంటోంది. ఈనాడు సీఎస్‌ఆర్‌ కార్యక్రమం 'లక్ష్య' క్రీడాకారుడు ఇంజమూరి శ్యామ్‌ (ఆంధ్రప్రదేశ్‌)కు మెడల్ మిస్ అయింది. టీ64 పురుషుల హై జంప్‌లో శ్యామ్‌ (1.75 మీటర్లు) ఐదో స్థానంలో నిలిచాడు. భారత్‌కు చెందిన ప్రవీణ్‌ (2.02మీ- మీట్‌ రికార్డు) గోల్డ్ మెడల్​, రేణు ఉన్ని (1.95 మీ) బ్రాండ్ మెడల్ దక్కించుకున్నారు.

Asian Para Games 2023 : ఆసియా పారా గేమ్స్​లో భారత్​ జోరు.. పసిడి సహా మరో రెండు పతకాలు

World Cup 2023 SA Vs BAN : సౌతాఫ్రికా ఆల్​రౌండ్​ షో.. బంగ్లాపై ఘన విజయం.. మహ్మదుల్లా సెంచరీ వృథా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.