ETV Bharat / sports

Padma Awards 2022: నీరజ్ చోప్డాకు పద్మశ్రీ పురస్కారం - padma awards 2022

Padma Awards 2022: కేంద్ర ప్రభుత్వం తొమ్మిది మంది క్రీడాకారులకు పద్మ అవార్డులను ప్రకటించింది. టోక్యో ఒలింపిక్స్​లో స్వర్ణంతో చరిత్ర సృష్టించిన నీరజ్​ చోప్డాను పద్మశ్రీ వరించింది.

Padma Awards 2022
నీరజ్ చోప్డా
author img

By

Published : Jan 25, 2022, 9:25 PM IST

Padma Awards 2022: టోక్యో ఒలింపిక్స్​లో స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించిన జావెలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్డాను పద్మశ్రీ పురస్కారం వరించింది. 100 ఏళ్ల తర్వాత అథ్లెటిక్స్​లో గోల్డ్ మెడల్ గెలిచిన భారత క్రీడాకారుడిగా నిలిచిన అతడిని ఈ అవార్డుతో కేంద్ర ప్రభుత్వం సత్కరించనుంది.

Padma Awards 2022
నీరజ్

అతడితో పాటు దేశానికి ఎనలేని సేవలందించిన పలువురు క్రీడాకారులకు మంగళవారం పద్మ పురస్కారాలను ప్రకటించింది కేంద్రం. క్రీడల్లో ఒకరిని పద్మ విభూషణ్​, ఎనిమిది మందిని పద్మశ్రీ పురస్కారంతో సత్కరించనుంది.

పద్మ విభూషన్- పారాలింపిక్స్​లో తొలిసారి రెండు స్వర్ణాలు సాధించిన రాజస్థాన్​కు చెందిన దేవేంద్ర ఝఝారియాను పద్మ విభూషణ్​ వరించింది.

పద్మ శ్రీ:

  • సుమిత్ అంతిల్ (పారాలింపియన్​- జావెలిన్ త్రో​)-హరియాణా
    Padma Awards 2022
    సుమిత్
  • ప్రమోద్ భగత్ (పారా బ్యాడ్మింటన్ )-ఒడిశా
    Padma Awards 2022
    ప్రమోద్ భగత్
  • నీరజ్ చోప్డా (ట్రాక్​ అండ్ ఫీల్డ్ అథ్లెట్- జావెలిన్ త్రో)-హరియాణా
  • శంకరనారాయణ మేనన్ చుందాయిల్-కేరళ
  • ఫైజల్ అలీ దర్- జమ్ముకశ్మీర్
  • వందనా కటారియా (హాకీ )-ఉత్తరాఖండ్
    Padma Awards 2022
    వందనా కటారియా
  • బ్రహ్మానంద్ సంఖ్వాల్కర్​ (ఫుట్​బాల్)-గోవా
  • అవనీ లేఖరా (పారాలింపియన్-)- రాజస్థాన్

ఇదీ చూడండి: నీరజ్​ చోప్రాకు మరో అరుదైన గౌరవం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.