టోక్యోలో ఈసారి అందరి దృష్టి హెంద్ జజా (Hend Zaza)పైనే. ఎందుకంటే ఈ ఒలింపిక్స్ (Tokyo Olympics)లో పోటీపడుతున్న అత్యంత పిన్న వయసు అథ్లెట్ ఆమె. సిరియాకు చెందిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి హెంద్ 12 ఏళ్లకే ఒలింపిక్స్‌లో పాల్గొనబోతోంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 155వ స్థానంలో ఉన్న జజా.. జోర్డాన్‌లో గత ఫిబ్రవరిలో జరిగిన పశ్చిమ ఆసియా టీటీ అర్హత టోర్నీలో టైటిల్ ద్వారా టోక్యో బెర్తు సంపాదించింది. బెర్తు దక్కించుకునే సమయానికి ఆమె వయసు 11 ఏళ్లే కావడం విశేషం.
ఒలింపిక్స్‌లో పాల్గొనబోతున్న ఐదో పిన్న వయస్కురాలు ఈమె. 1968 మెక్సికో ఒలింపిక్స్‌లో బిట్రీస్ (రొమేనియా, ఫిగర్ స్కేటింగ్, 13 ఏళ్లు) తర్వాత ఇంత చిన్న వయసులో ఈ మెగా ఈవెంట్లో పోటీపడుతున్న ఘనత హెంద్‌దే. 1896 ఏథెన్స్ ఆధునిక ఒలింపిక్స్‌లో 10 ఏళ్ల పిన్న వయస్సులో జిమ్నాస్ట్ దిమిత్రోస్ లౌండ్రాస్ పోటీపడి కాంస్యం గెలిచాడు. ఒలింపిక్స్‌లో పిన్న వయసు అథ్లెట్ రికార్డు అతడిదే.
ఇదీ చదవండి: Olympics: ప్రేక్షకులు లేకుండానే ఒలింపిక్స్