ETV Bharat / sports

పరుగు మధ్యలో గాయం- ట్రాక్​లోకి దిగిన తండ్రి! - Olympics: Blast from past

ఒలింపిక్స్​ అంటేనే వింతలు, విశేషాలు, ఆసక్తికర సంఘటనలు, రికార్డులు.. ఇలా విభిన్న అంశాలు ఉంటాయి. శుక్రవారం నుంచి (జులై 23) టోక్యో విశ్వక్రీడలు​ ప్రారంభమవుతున్న నేపథ్యంలో 1988, 1992, 1996 ఒలింపిక్స్​కు సంబంధించి ఆసక్తికర విషయాలు మీరూ తెలుసుకోండి.

1988 Seoul Olympics, 1992 Barcelona Olympics
1988 సియోల్ ఒలింపిక్స్, 1992 బార్సిలోనా ఒలింపిక్స్
author img

By

Published : Jul 23, 2021, 1:30 PM IST

టోక్యో ఒలింపిక్స్​ ప్రారంభోత్సవ కార్యక్రమం మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. అంతకంటే ముందే సాఫ్ట్​బాల్​, ఆర్చరీ.. వంటి క్రీడలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో గత ఒలింపిక్స్​లో జరిగిన కొన్ని ఆసక్తికర సంఘటనలు, విశేషాలు.. మీకోసం.

సియోల్ ఒలింపిక్స్-1988

  • డెమొక్రాటిక్​ పీపుల్స్​ రిపబ్లిక్ ఆఫ్ కొరియా(ఉత్తర కొరియా) ఒలింపిక్స్​ను బహిష్కరించింది. క్యూబా, ఇథియోపియా, నికరగువా విశ్వక్రీడల్లో చేరాయి.
  • 64 ఏళ్ల తర్వాత టెన్నిస్​ను తిరిగి ఈ విశ్వ క్రీడల్లో ప్రవేశపెట్టారు. ఈసారి ప్రొఫెషనల్​ క్రీడాకారులకు అవకాశం కల్పించారు. ఇందులో పాల్గొన్న జర్మనీ టెన్నిస్ ప్లేయర్​ స్టెఫీ గ్రాఫ్​ స్వర్ణంతో గ్రాండ్​స్లామ్​​ సీజన్​కు వీడ్కోలు చెప్పింది.
  • డ్రగ్స్​ను వాడినందుకు గానూ పది మంది అథ్లెట్లను ఈ మెగా ఈవెంట్ నుంచి నిషేధించారు.
  • స్వీడన్​ ఫెన్సర్​ కెర్స్టిన్​ పామ్​​.. ఏడు ఒలింపిక్స్​ల్లో పాల్గొన్న తొలి మహిళగా సరికొత్త రికార్డు సృష్టించింది.
  • గుర్రపు పందేలలో తొలిసారిగా మూడు పతకాలు మహిళలకే దక్కాయి.
  • 100 మీ. పరుగులో కెనడా స్ప్రింటర్​ బెన్​ జాన్సన్​ ప్రపంచ రికార్డు సృష్టించాడు. గోల్డ్​ మెడల్​ గెలుచుకున్నాడు. కానీ, అతడు నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినందుకు గానూ అతడిపై అనర్హత వేటు పడింది. దీంతో రెండో స్థానంలో ఉన్న అమెరికా అథ్లెట్​ కార్ల్​ లూయిస్​కు పసిడి దక్కింది. అంతకుముందు 1984 విశ్వక్రీడల్లోనూ లూయిస్​ స్వర్ణంతో మెరిశాడు. దీంతో వరుసగా రెండు సార్లు బంగారు పతకం అతడికి దక్కినట్లైంది.
  • పోల్​ వాల్ట్ క్రీడలో సోవియట్​ ప్లేయర్​ సర్గే బుబ్కా తొలి గోల్డ్​ మెడల్​ను గెలుచుకున్నాడు.
  • రొమేనియా జిమ్నాస్ట్​ ప్లేయర్​ డానియల్​ సిలివాస్​ ఒకే ఒలింపిక్స్​లో మూడు స్వర్ణాలు తన ఖాతాలో వేసుకున్నాడు. స్వదేశీయుడు నదియా కొమనేసి రికార్డును సమం చేశాడు.

ఇదీ చదవండి: Tokyo Olympics Medals: పతకాల వేటలో.. ఎవరిది పైచేయి?

బార్సిలోనా ఒలింపిక్స్​-1992

  • 32 ఏళ్ల నిషేధం అనంతరం సౌతాఫ్రికా తిరిగి విశ్వక్రీడల్లో పాల్గొంది.
  • తొలిసారిగా బాణం సహాయంతో ఒలింపిక్ జ్యోతిని వెలిగించారు.
  • 1964 ఒలింపిక్స్ తర్వాత తిరిగి బార్సిలోనా విశ్వక్రీడల్లో జర్మనీ ఒకే దేశంగా బరిలోకి దిగింది.
  • బ్యాడ్మింటన్​, మహిళల జూడో క్రీడలు ఒలింపిక్స్​లోకి ప్రవేశించాయి.
  • ఒలింపిక్స్​లో స్వర్ణం గెలిచిన అత్యంత పిన్న వయస్కురాలిగా చైనా డైవింగ్​ క్రీడాకారిణి ఫు మింగ్క్సియా నిలిచింది. అప్పటికి ఆమె వయసు 13 ఏళ్లు.
  • 1991లో సోవియట్​ యూనియన్ రద్దైంది. దీంతో 1936 తర్వాత ఇస్తోనియా, లాత్వియా, లిథువేనియా.. వంటి దేశాలు తమ సొంత జట్లను ఒలింపిక్స్​కు పంపాయి.
  • సోషలిస్ట్​ ఫెడరల్​ రిపబ్లిక్​ ఆఫ్ యుగోస్లేవియా విడిపోయిన తర్వాత క్రొయేషియా, స్లోవేనియా, బోస్నియా, హెర్జగోవియా తొలి సారిగా విశ్వక్రీడల్లో పాల్గొన్నాయి.
  • గ్రేట్​ బ్రిటన్​ స్ప్రింటర్​ డెరెక్ రెడ్మండ్​.. 400మీ. పరుగు మధ్యలో గాయపడ్డాడు. డెరెక్​ బాధ చూడలేక అతడి తండ్రి ట్రాక్​లోకి దిగి లక్ష్యాన్ని పూర్తి చేయడానికి సాయమందించాడు. దీంతో స్టేడియంలోని ప్రేక్షకులు నిలబడి చప్పట్లు కొట్టారు.

అట్లాంటా ఒలింపిక్స్​-1996

  • బాక్సింగ్ దిగ్గజం మహ్మద్ అలీ ఒలింపిక్​ జ్యోతిని వెలిగించాడు.
  • ఒలింపిక్​ చరిత్రలో మొదటిసారి గుర్తింపు పొందిన 197 జాతీయ ఒలింపిక్​ కమిటీలు ఆటలకు ప్రాతినిధ్యం వహించాయి.
  • బీచ్​ వాలీబాల్, మౌంటైన్​ బైకింగ్, రోయింగ్, మహిళల ఫుట్​బాల్ వంటి క్రీడలు ఒలింపిక్స్​లో తొలిసారిగా ప్రవేశించాయి.
  • అట్లాంటాలో తొలిసారిగా 24 దేశాలు అరంగేట్రం చేశాయి. వాటిలో 11 సోవియట్​ రిపబ్లిక్​ దేశాలు స్వతంత్ర దేశాలుగా పాల్గొన్నాయి.
  • అమెరికా టెన్నిస్ ప్లేయర్​ ఆండ్రీ అగస్సీ.. ఒలింపిక్స్​ పురుషుల సింగిల్స్​లో స్వర్ణం గెలిచిన తొలి ఆటగాడిగా నిలిచాడు.
  • ఆస్ట్రియా నావికుడు హుబెర్ట్​ రౌడాచ్ల్​ అత్యధికంగా తొమ్మిది ఆటలలో పాల్గొన్నాడు. ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడు అతడే.
  • ట్రాక్ అండ్ ఫీల్డ్​ విభాగంలో తొమ్మిదో సారి గోల్డ్​ మెడల్​ను గెలుచుకున్నాడు అమెరికా స్ప్రింటర్​ కార్ల్​ లూయిస్. ​

ఇదీ చదవండి: Olympics: ర్యాంకింగ్​ రౌండ్​ను 9వ స్థానంతో ముగించిన దీపిక

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.