కరోనా వైరస్ సెగ ఒలింపిక్స్‌నూ తాకింది. షెడ్యూల్ ప్రకారమే ఈ మెగాటోర్నీ జరుగుతుందని జపాన్ చెప్పినప్పటికీ... తాజాగా ఒలింపిక్ ర్యాలీ రద్దయింది. గురువారం ఒలింపిక్స్ పుట్టినిల్లు ఒలింపియా నుంచి ఒలింపిక్ జ్యోతిని వెలిగించారు. ఇది పలు ప్రాంతాల్లో ర్యాలీగా ప్రదర్శించిన తర్వాత చివరకు టోక్యో చేరాల్సింది. కానీ కరోనా వ్యాప్తి నేపథ్యంలో ర్యాలీని రద్దు చేసింది గ్రీస్ ప్రభుత్వం.
ఇదీ జరగాల్సింది..
ఏథెన్స్లోని ఒలింపియా వద్ద జ్యోతి వెలిగించిన తర్వాత 7 రోజులు గ్రీస్ మొత్తం ర్యాలీగా ప్రదర్శన చేస్తారు. ఆ తర్వాత గ్రీస్ దేశంలోని 37 నగరాలు, 15 చారిత్రక ప్రదేశాల మీదుగా.. దాదాపు 3,500 కిలోమీటర్ల దూరం జ్యోతిని తిప్పుతారు. ఇందుకు భారీగా ప్రజలు సైతం హాజరవుతారు. అనంతరం మార్చి 19న జపాన్‌లోని ఫుకుషిమాకు చేరుతుంది. అక్కడి నుంచి ఒలింపిక్స్ జరిగే టోక్యోకు చేరుతుంది.
-
Watch highlights from the first day of the Tokyo2020 #OlympicTorchRelay.
— #Tokyo2020 (@Tokyo2020) March 12, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
The beginning of a journey that will culminate at the #Tokyo2020 Opening Ceremony. #UnitedByEmotion pic.twitter.com/sboOY6hGup
">Watch highlights from the first day of the Tokyo2020 #OlympicTorchRelay.
— #Tokyo2020 (@Tokyo2020) March 12, 2020
The beginning of a journey that will culminate at the #Tokyo2020 Opening Ceremony. #UnitedByEmotion pic.twitter.com/sboOY6hGupWatch highlights from the first day of the Tokyo2020 #OlympicTorchRelay.
— #Tokyo2020 (@Tokyo2020) March 12, 2020
The beginning of a journey that will culminate at the #Tokyo2020 Opening Ceremony. #UnitedByEmotion pic.twitter.com/sboOY6hGup
కచ్చితంగా నిర్వహిస్తాం...
ఒలింపిక్స్‌ను వాయిదా వేయాలా? రద్దు చేయాలా? అనే దానిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఓవైపు చెప్తుంటే.. షెడ్యూల్ ప్రకారమే క్రీడా సంబరం జరిపి తీరుతామని జపాన్ ప్రధాని షింజో అబే విశ్వాసం వ్యక్తం చేశారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారమే ఒలింపిక్స్ జరుగుతాయని.. ఈ విషయంలో అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం(ఐఓసీ)తో కలిసి పని చేస్తున్నామన్నారు. ఒలింపిక్స్ నిర్వహణ అనేది ఆలస్యం కావడం కానీ, వాయిదా పడటం కానీ జరగదన్నారు. జూన్ 24వ తేదీ నుంచి ఆగస్టు 8 వరకు ఈ మెగాటోర్నీ నిర్వహిస్తామన్నారు.