హత్య కేసులో ప్రస్తుతం పరారీలో ఉన్న రెజ్లర్ సుశీల్ కుమార్ కోర్టును ఆశ్రయించాడు. ముందస్తు బెయిల్ కోసం రోహిణి కోర్ట్‌లో పిటిషన్ నమోదు చేశాడు. ఛత్రసాల్ స్టేడియం వద్ద రెజ్లర్ సాగర్ రాణా హత్యకు సంబంధించి మరో ఆరుగురితో పాటు సుశీల్‌పై ఇప్పటికే నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారు పోలీసులు.
పట్టుకుంటే లక్ష రివార్డు
సుశీల్ ఆచూకీ చెప్పడం ద్వారా అతడి ఆరెస్ట్‌కు సహకరించిన వారికి రూ.లక్ష రూపాయల నగదు బహుమతిని ఇస్తామని దిల్లీ పోలీసులు సోమవారం ప్రకటించారు. పరారీలో ఉన్న అతడి కోసం కొన్ని రోజులుగా పోలీసులు గాలిస్తున్నారు.