ETV Bharat / sports

ఒలింపిక్‌ విజేత మరి.. ప్రాక్టీస్‌ ఇలానే ఉంటుంది! - ఒలింపిక్‌ మెడల్‌ విజేత చెల్సీ మొమెల్‌

ఒలింపిక్​ క్రీడల్లో పతకమంటే మాటలు కాదు. ఆ విశ్వక్రీడల్లో పోటీపడేందుకు తీవ్రంగా చెమటోడుస్తూ సాధన చేస్తుంటారు ఆటగాళ్లు. అయితే తాజాగా అమెరికా జిమ్నాస్ట్​ చెల్సీ మొమెల్​ ప్రాక్టీస్​ చేస్తున్న వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.

chellsie memmel
ఒలింపిక్‌ విజేత మరి.. ప్రాక్టీస్‌ ఇలానే ఉంటుంది!
author img

By

Published : Nov 18, 2020, 10:35 AM IST

క్రీడాకారులకు ఫిట్‌నెస్‌ ఎంతో కీలకం. జిమ్నాస్టిక్స్‌ చేసేవారికి మరీ ముఖ్యం. శారీరక దారుఢ్యం కలిగి ఉండాలి. శరీరం ఎలా పడితే అలా తిరిగిపోవాలి. ఫీట్ చేసేటప్పుడు బ్యాలెన్స్‌ చేయగలగాలి. అందులోనూ జిమ్నాస్టిక్స్‌ సాధన కూడా ఎంతో కష్టతరం. ఏకాగ్రతతో చేస్తేనే విజయం వరించేది. అలా ప్రాక్టీస్‌ చేస్తున్న ఓ అంతర్జాతీయ స్థాయి జిమ్నాస్ట్‌ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

ఒలింపిక్‌ మెడల్‌ విజేత అయిన చెల్సీ మొమెల్‌ అమెరికాకు చెందిన క్రీడాకారిణి. తాజాగా ప్రాక్టీస్‌ చేస్తున్న వీడియోను ఆమె సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. దీంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆమె సాధనను నెటిజన్లు కొనియాడుతున్నారు. అద్భుతంగా ఉందని అభినందిస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఆ వీడియోను మీరూ చూసేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.