అమెరికాకు చెందిన 23 సంవత్సరాల కేటీ లెడెక్కీ ఐదు ఒలింపిక్స్ స్వర్ణపతకాల విజేత. ప్రపంచ ఛాంపియన్షిప్ ఈత పోటీల్లో 15 సార్లు ఛాంపియన్గా నిలిచి రికార్డు సృష్టించింది. ఈతలో కేటీ నైపుణ్యం అనితర సాధ్యం.. అయినా ఈమె ఇటీవల వీడియోను చూసిన వారు ఇదెలా సాధ్యమంటూ ఆశ్చర్యపోతున్నారు. కాగా, ఆ వీడియోను కేటీ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.
ఇంతకీ ఆమె అంత గొప్పగా ఏం చేశారంటే... కేటీ తన తలపై చాక్లెట్ మిల్క్ ఉన్న ఒ గ్లాసును ఉంచుకుని ఓ స్విమ్మింగ్ పూల్లో ఒక చివరి నుంచి రెండో చివరి వరకు ఈత కొట్టారు. ఈ పనిని ఆమె గ్లాసులో పాలు ఒక్క బొట్టు కూడా వొలకకుండా పూర్తిచేశారు. అనంతరం ఆమె తలపై నుంచి గ్లాసు తీసి చక్కగా తాగేయటాన్ని కూడా ఈ వీడియోలో మనం చూడొచ్చు. దీనితో ఈమె పేరు మరోసారి నెట్టింట్లో మారుమోగుతోంది.
-
Possibly one of the best swims of my career! (~open for debate~)
— Katie Ledecky (@katieledecky) August 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
What can you do without spilling a drop?! Check out the #gotmilkchallenge on TikTok. #gotmilk #ad pic.twitter.com/F05UzvaqCo
">Possibly one of the best swims of my career! (~open for debate~)
— Katie Ledecky (@katieledecky) August 3, 2020
What can you do without spilling a drop?! Check out the #gotmilkchallenge on TikTok. #gotmilk #ad pic.twitter.com/F05UzvaqCoPossibly one of the best swims of my career! (~open for debate~)
— Katie Ledecky (@katieledecky) August 3, 2020
What can you do without spilling a drop?! Check out the #gotmilkchallenge on TikTok. #gotmilk #ad pic.twitter.com/F05UzvaqCo