ETV Bharat / sports

బాక్సింగ్​ సమాఖ్యను కాపాడాలంటూ మోదీకి లేఖ! - మోదీకి బాక్సర్​ మనోజ్​ కుమార్​ లేఖ

బాక్సింగ్​ ఫెడరేషన్​ ఆఫ్​ ఇండియా (బీఎఫ్​ఐ)ను కాపాడాలని బాక్సర్​ మనోజ్​ కుమార్​.. ప్రధాని మోదీకి లేఖలో విజ్ఞప్తి చేశారు. బాక్సింగ్​ సమాఖ్య అధ్యక్ష పదవికి ఎన్నిక జరగకుండా ప్రస్తుతం అధ్యక్షుడు అజయ్​ సింగ్​ అడ్డుపడుతున్నారని ఆ లేఖలో ఆరోపించారు. ఇలాంటి పరిణామాల మధ్య ప్రధాని మోదీ జోక్యం అవసరమని భావించినట్లు మనోజ్​ వెల్లడించారు.

Olympian Manoj Kumar seeks PM Modi's intervention to save Boxing Federation of India
బాక్సింగ్​ సమాఖ్యను కాపాడాలంటూ మోదీకి లేఖ!
author img

By

Published : Dec 16, 2020, 10:10 PM IST

బాక్సింగ్​ ఫెడరేషన్​ ఆఫ్​ ఇండియా (బీఎఫ్​ఐ)ను కాపాడాలని ప్రధాని నరేంద్రమోదీని కామన్వెల్త్​ గేమ్స్​ స్వర్ణ విజేత బాక్సర్​ మనోజ్​ కుమార్​ కోరారు. బాక్సింగ్​ ఫెడరేషన్​ను క్రీడా మంత్రిత్వశాఖ విస్మరిస్తుందని మోదీకి లేఖలో వివరించారు. దిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు డిసెంబరు 31లోగా బాక్సింగ్​ ఫెడరేషన్​ ఆఫీస్-బేరర్ల ఎన్నికలను నిర్వహించాలనే ఆదేశాన్ని లేవనెత్తాడు.

అయితే ప్రధాని మోదీకి లేఖ రాయడం పట్ల బాక్సర్​ మనోజ్​ కుమార్​ బుధవారం వివరణ ఇచ్చారు.

"ఫెడరేషన్​ ఎన్నికల నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలవ్వగా.. దానికి సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. రిటర్నింగ్​ ఆఫీసర్​ కూడా విధులు నిర్వర్తిస్తున్నారు. అశిష్​ షెలార్​ వంటి బలమైన అభ్యర్థి అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి నామినేషన్​ దాఖలు చేసినట్లు తెలుసుకున్న బీఎఫ్​ఐ అధ్యక్షుడు అజయ్​సింగ్​ ఎన్నికను వాయిదా వేస్తూ వచ్చారు. ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత జోక్యం చేసుకునే హక్కు అజయ్​కు లేదు. వాయిదా వేయాలని ఏకపక్ష నిర్ణయాన్ని తీసుకున్నారు. బీఎఫ్​ఐ అధ్యక్షుడిగా పూర్తిగా విఫల్యమయ్యారు".

- మనోజ్​ కుమార్​, బాక్సర్​

బీఎఫ్​ఐ అధ్యక్ష పదవి ఎన్నిక వాయిదా వేస్తున్న ప్రక్రియను తప్పుబట్టారు. "కరోనా సమయంలోనే బిహార్​, హైదరాబాద్​లో ఎన్నికలు నిర్వహించారు. మనం ఎందుకు అలా చేయలేమని" మనోజ్​ ప్రశ్నించాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.