ETV Bharat / sports

ఖేల్​రత్నకు అంజుమ్​.. ద్రోణాచార్యకు రాణా నామినేట్​! - జస్పాల్​ రాణా

కేంద్ర ప్రభుత్వం క్రీడాకారులను సత్కరించే పురస్కారాలకు షూటింగ్​ నుంచి నలుగురి పేర్లను నేషనల్​ రైఫిల్​ అసోసియేషన్​ ఆఫ్​ ఇండియా (ఎన్ఆర్​ఏఐ) సిఫారసు చేయనుందని సమాచారం. ఖేల్​ రత్న, ద్రోణాచార్యకు ఒక్కొక్కరిని.. అర్జున అవార్డులకు మరో ఇద్దరి పేర్లను పంపించనున్నారని సీనియర్​ అధికారి తెలిపారు.

NRAI nominates Anjum Moudgil for Khel Ratna, Jaspal for Dronachary Award
ఖేల్​రత్నకు అంజుమ్​.. ద్రోణాచార్యకు రాణా నామినేట్​!
author img

By

Published : May 14, 2020, 2:49 PM IST

షూటర్​ అంజుమ్​ మౌద్గిల్​ను ఖేల్​ రత్నకు.. జస్పాల్​ రాణాను ద్రోణాచార్యకు నేషనల్​ రైఫిల్​ అసోసియేషన్​ ఆఫ్​ ఇండియా (ఎన్​ఆర్​ఏఐ) నామినేట్​ చేయనున్నట్లు సమాచారం. వీటిని పొందడానికి వీరిద్దరికి తగిన అర్హత ఉందని వారు భావిస్తున్నారు.

ఇదే జరిగితే జస్పాల్​ రాణాను రెండోసారి ఈ పురస్కారానికి నామినేట్​ చేసినట్లు అవుతుంది. వీరితో పాటు పిస్టోల్​ షూటర్ సౌరభ్​ చౌదరి, అభిషేక్​ వర్మ పేర్లను అర్జున అవార్డుకు పంపుతున్నట్లు ఎన్​ఆర్​ఏఐ సీనియర్ అధికారి ఒకరు తెలియజేశారు.

ఆరంభంలోనే పతకం

టోక్యో ఒలింపిక్స్​కు దేశం నుంచి అర్హత సాధించిన తొలి ఇద్దరిలో అంజుమ్ మౌద్గిల్​ ఒకరు. 2008లో షూటింగ్​ ప్రారంభించిన అంజుమ్​.. అదే ఏడాది కొరియాలో జరిగిన పది మీటర్ల ఎయిర్​ రైఫిల్​ ఈవెంట్​లో రజత పతకం సాధించింది. గతేడాది బీజింగ్​లో జరిగిన ఐఎస్​ఎస్​ఎఫ్​ ప్రపంచకప్​లో దివ్యాన్ష్​ సింగ్​తో కలిసి 10 మీటర్ల ఎయిర్​ రైఫిల్​ మిక్స్​డ్​ ఈవెంట్​లో పసిడి గెలిచింది.

ద్రోణాచార్యకు నామినేట్​

కోచ్​ జస్పాల్​ రాణాకు ద్రోణాచార్య అవార్డు దక్కకపోవడం పట్ల సెలక్షన్​ కమిటీపై ఒలింపిక్​ గోల్డ్​ మెడలిస్ట్​ అభినవ్​ బింద్రా విమర్శలు చేశాడు. అప్పట్లో ఇది పెద్ద వివాదంగా మారింది. రాణా.. ఇప్పటివరకు బహుళ ఆసియా క్రీడల్లో బంగారు పతక విజేతగా నిలిచాడు. మను బాకర్​, సౌరభ్​, అనీశ్​ భన్వాలా వంటి వారిని షూటర్లుగా తీర్చిదిద్దిన ఘనత రాణాకే దక్కుతుంది.

ఇదీ చూడండి.. కోహ్లీ కాదు ధోనీనే ఫేవరెట్: ధావన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.