ETV Bharat / sports

ప్రపంచ బాక్సింగ్​ ఛాంపియన్​షిప్​లో నిఖత్​ 'పంచ్​ పవర్'​.. క్వార్టర్స్​లోకి తెలంగాణ అమ్మాయి - నిఖత్​ జరీన్​

భారత స్టార్​ బాక్సర్ నిఖత్​ జరీన్​ ప్రపంచ మహిళల బాక్సింగ్​ ఛాంపియన్​షిప్​లో అదరగొడుతోంది. 50 కేజీల ప్రీక్వార్టర్స్‌లో ఆమె 5-0తో ప్యాట్రిసియా అల్వరెజ్‌ (మెక్సికో)ను చిత్తు చేసి క్వార్టర్స్​కు చేరుకుంది.

Nikhat Zareen
Nikhat Zareen
author img

By

Published : Mar 22, 2023, 6:37 AM IST

తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ ప్రపంచ మహిళల బాక్సింగ్​ ఛాంపియన్​షిప్​లో అదరగొడుతోంది. టైటిల్‌ను నిలబెట్టుకునే దిశగా ఈ తెలంగాణ అమ్మాయి మరో అడుగు ముందుకేసింది. మంగళవారం జరిగిన 50 కేజీల ప్రీక్వార్టర్స్‌లో ఆమె 5-0తో ప్యాట్రిసియా అల్వరెజ్‌ (మెక్సికో)ను చిత్తు చేసింది. ఆరంభం నుంచి పంచ్‌ పవర్‌ చూపించిన నిఖత్‌.. ప్రత్యర్థికి అవకాశమే ఇవ్వలేదు. మంచి ఫుట్‌వర్క్‌కు తోడు లెఫ్ట్‌, రైట్‌ హుక్‌ల మేళవింపుతో దాడికి దిగిన నిఖత్​ జరీన్‌ ముందు ప్యాట్రిసియా తేలిపోయింది. ప్రతి రౌండ్లోనూ న్యాయ నిర్ణేతలంతా నిఖత్‌కే ఓటేయడంతో ఆమె ఘన విజయాన్ని అందుకుంది.

మరోవైపు భారత్​కు చెందిన నీతు గాంగాస్‌ (48 కేజీ), మనీషా మౌన్‌ (57 కేజీ), జాస్మిన్‌ (60 కేజీ) క్వార్టర్‌ఫైనల్‌ చేరారు. ప్రీక్వార్టర్స్‌లో సుమైయా ఖొసిమోవా (తజకిస్థాన్‌)ను నీతు నాకౌట్‌ చేసింది. తొలి రౌండ్లోనే నీతు పంచ్‌లకు సుమైవా తాళలేకపోవడంతో రిఫరీ బౌట్‌ను ఆపేశాడు. మరో ప్రిక్వార్టర్స్‌లో నూర్‌ తుర్హాన్‌ (తుర్కియే)పై మనీషా నెగ్గింది. ప్రత్యర్థి బాక్సర్‌ కంటే పొడగరి అయిన మనీషా పదునైన పంచ్‌లతో అటాక్‌ చేసి విజయాన్ని అందుకుంది. మనీషా దూకుడుకు నూర్‌ ఆటను కొనసాగించలేకపోవడంతో రిఫరీ మ్యాచ్‌ను ఆపి భారత బాక్సర్‌ను విజేతగా ప్రకటించాడు. ఇంకో ప్రీ క్వార్టర్స్‌లో సమదోవా (తజకిస్థాన్‌)ను జాస్మిన్‌ ఓడించింది. మరోవైపు శశి చోప్రా (63 కేజీ), మంజు (66 కేజీ) టోర్నీ నుంచి నిష్క్రమించారు. కిటో (జపాన్‌) చేతిలో శశి.. ఖామిదోవా (ఉబ్బెకిస్థాన్‌) చేతిలో మంజు చిత్తయ్యారు.

కాగా, ఆదివారం దిల్లీలోని కేడీ జాదవ్​ స్టేడియంలో జరిగిన మ్యాచ్​లో ఆఫ్రికన్​ ఛాంపియన్ అల్జీరియాకు చెందిన బౌలమ్​ రౌమైసాతో తలపడింది నిఖత్.​ 5-0 ఏకపక్ష స్కోర్​తో ప్రత్యర్థిని ఓడించి ప్రీ-క్వార్టర్స్ ఆడింది. మ్యాచ్​ ఆరంభంలో బాక్సర్లు ఇద్దరూ ఎంతో ఆచితూచి జాగ్రత్తగా ఆడారు. అయితే ఆట మొదటి రౌండ్​లో నిఖత్​కు తన ఆటతీరుతో విజృంభించింది. దీంతో ఆ రౌండ్​ ఆమెకు అనుకూలంగా మారినట్లయింది. ఎన్నో బాడీ షాట్ల వ్యూహాలను ఒకరిపై ఒకరు ప్రయెగించకున్నారు. చివరకు 5-0తో వార్​ వన్​ సైడ్​ చేసి విజేతగా నిలిచింది నిఖత్​ జరీన్​. గతేడాది జరిగిన కామన్​వెల్త్​ గేమ్స్​-2022లో స్వర్ణం సాధించిన నిఖత్​ జరీన్​ వరల్డ్​ బాక్సింగ్​ ఛాంపియన్​లలో ఒకరుగా ఉంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.