ప్రపంచవ్యాప్తంగా పట్టి పీడిస్తున్న కరోనా.. క్రీడాకారులపైనా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. తాజాగా అమెరికాలోని నేషనల్ ఫుట్‌బాల్ లీగ్‌కు చెందిన 95 మంది ఫుట్‌బాల్ ప్లేయర్లు ఈ మహమ్మారి బారిన పడ్డారు. వారందరినీ క్వారంటైన్లో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు.
రెండు వారాల పర్యవేక్షణ...
కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. కనీసం రెండు వారాల పాటు శిక్షణా శిబిరాల్లో రోజూ ఆటగాళ్లకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే కొత్తగా జూనియర్ ఆటగాళ్లు శిక్షణ శిబిరాలకు హాజరవుతున్న వేళ.. నేషనల్ ఫుట్‌బాల్ లీగ్, ఎన్ఎఫ్ఎల్పీఏ సంయుక్తంగా కరోనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించుకున్నాయి.
మరోవైపు సీనియర్ ఆటగాళ్లు వచ్చే వారంలో శిక్షణలో చేరనున్నట్లు అధికారులు తెలిపారు. దాదాపు మూడు నెలల తర్వాత ఇటీవలె ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఫుట్‌బాల్ శిక్షణా కార్యక్రమాలు మొదలయ్యాయి.