ETV Bharat / sports

నీరజ్​ చోప్రాకు మరో అరుదైన గౌరవం - ఒలింపిక్​ గోల్డ్​ మెడలిస్ట్​ నీరజ్​ చోప్రా

Neeraj Chopra Param Vashistha Seva: టోక్యో ఒలింపిక్స్​లో దేశానికి స్వర పతకం అందించిన నీరజ్​ చోప్రాకు మరో అరుదైన గౌరవం దక్కింది. గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని కేంద్రం అతడిని విశిష్ట సేవా మెడల్​తో సత్కరించనుంది.

Neeraj Chopra  Param Vashistha Seva Medal
నీరజ్​ చోప్రా విశిష్ట సేవా మెడల్​
author img

By

Published : Jan 25, 2022, 6:46 PM IST

Neeraj Chopra Param Vashistha Seva: టోక్యో ఒలింపిక్స్​లో స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించిన బల్లెం వీరుడు నీరజ్​ చోప్రాకు అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర ప్రభుత్వం.. గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని విశిష్ట సేవా పతకంతో నీరజ్​ను సత్కరించనుంది. రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ చోప్రాకు ఈ పురస్కారాన్ని అందించనున్నారు.

రిపబ్లిక్​ డే సందర్భంగా దిల్లీలోని రాష్ట్రపతి భవన్​లో రక్షణ సిబ్బందికి గ్యాలంటరీ సహా ఇతర అవార్డులతో సత్కరించనున్నారు. కాగా, నీరజ్​ ఆర్మీలో సుబేదార్​గా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే అతడిని విశిష్ట సేవా పతకంతో కేంద్రం సత్కరించనుంది.

నీరజ్​.. ఒలింపిక్స్​ జావెలిన్​ త్రోలో 87.58మీటర్ల దూరం విసిరి స్వర్ణంతో మెరిశాడు నీరజ్​. ​100 ఏళ్ల తర్వాత అథ్లెటిక్స్​లో గోల్డ్ మెడల్ గెలిచిన భారత క్రీడాకారుడిగా రికార్డు సృష్టించాడు.

ఇదీ చూడండి:

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

హాకీ ఆడిన నీరజ్.. బల్లెం విసిరిన మన్​ప్రీత్​ సింగ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.