Laureus Award: గతేడాది జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణం తెచ్చిపెట్టిన జావెలిన్ త్రో ఆటగాడు నీరజ్ చోప్డా మరో అరుదైన ఘనత సాధించాడు. అథ్లెటిక్స్‌లో దేశానికి తొలి స్వర్ణాన్ని అందించిన క్రీడాకారుడిగా కీర్తి పొందిన నీరజ్.. ప్రతిష్ఠాత్మక లారియూస్ వరల్డ్ బ్రేక్ త్రూ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. ఈ అవార్డుకు కేవలం ఆరుగురే నామినేట్ కావడం విశేషం.
నీరజ్‌తో పాటు అవార్డుకు నామినేట్ అయిన ఇతర ఆటగాళ్లలో ఎమ్మా రాడుకాను (టెన్నిస్), డెనిల్ మెద్వెదేవ్ (టెన్నిస్), పెడ్రి (ఫుట్‌బాల్), యులీమార్ రోజాస్ (అథ్లెట్), అరియార్నే టిట్మస్‌లు (స్విమ్మింగ్) ఉన్నారు.
ఇదీ చూడండి : ఇద్దరు కెప్టెన్ల సంస్కృతిపై ధోనీ ఏమన్నాడంటే!