కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో.. భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ) కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్లో జరగాల్సిన జాతీయ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ టోర్నీని వచ్చే ఏడాది జనవరి నాటికి వాయిదా వేసింది. ప్రస్తుత గందరగోళ పరిస్థితుల కారణంగానే.. పోటీలను నెలరోజుల పాటు వాయిదా వేయాల్సి వచ్చిందని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) సహాయ కార్యదర్శి వినోద్ తోమర్ తెలిపారు.
"జాతీయ ఛాంపియన్షిప్ను నిర్వహించేందుకు ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా లేవు. వచ్చే ఏడాది జనవరి ఆఖరున టోర్నీ నిర్వహించేందుకు మేము ఎదురుచూస్తున్నాం. పరిస్థితులు క్లిష్టంగా మారినప్పుడు గతంలోనూ మేం ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నాం."
-- వినోద్ తోమర్, డబ్ల్యూఎఫ్ఐ సహాయ కార్యదర్శి
ఈ ఏడాది ఛాంపియన్షిప్ పోటీలను ఉత్తర్ప్రదేశ్లో డిసెంబర్ 18 నుంచి 21 మధ్య నిర్వహించాలని తొలుత భావించింది డబ్ల్యూఎఫ్ఐ. అయితే తాజా నిర్ణయం ప్రకారం వేదికను కూడా మార్చనున్నట్లు వినోద్ తోమర్ స్పష్టం చేశారు.
డిసెంబర్ 12 నుంచి 18 వరకు సెర్బియాలో జరగనున్న రెజ్లింగ్ ప్రపంచ కప్ పోటీలకు.. స్వతంత్ర కేటగిరీలో భారత్ తరఫున క్రీడాకారులను పంపనున్నట్లు చెప్పారు.
ఇదీ చూడండి:'టీమ్ఇండియాకు ధోనీలాంటి నైపుణ్యాలు అవసరం'