ETV Bharat / sports

లాప్సన్ నా ముందు ఇంకా పిల్లాడే: విజేందర్

భారత ప్రొ బాక్సర్ విజేందర్ త్వరలోనే మళ్లీ బౌట్​లో అడుగుపెట్టనున్నాడు. మార్చి 19న ఆర్టిష్ లాప్సన్​తో అమీతుమీ తేల్చుకోనున్నాడు. ఈ మ్యాచ్​కు ముందు ఇరువురు తమ నోటికి పనిచెబుతున్నారు. ఒకరినొకరు కవ్వించుకుంటూ మాట్లాడుతున్నారు. తన ప్రత్యర్థి ఆర్టిష్ పొడగరే అయినా తనముందు ఇంకా పిల్లాడేనని విజేందర్ అన్నాడు.

Vijender
విజేందర్
author img

By

Published : Mar 16, 2021, 8:29 AM IST

తన కొత్త ప్రత్యర్థి ఆర్టిష్‌ లాప్సన్‌ పొడగరే అయినా తన ముందు మాత్రం పిల్లాడేనని భారత ప్రొ బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌ అంటున్నాడు. ఓటమెరుగని తన విజయాల రికార్డును ఇలాగే కొనసాగిస్తానని ధీమా వ్యక్తం చేశాడు. బాక్సింగ్‌లో బలం, వ్యూహం ప్రధానమని పేర్కొన్నాడు.

ప్రొ బాక్సింగ్‌లో ఇప్పటివరకు వరుసగా 12 విజయాలు సాధించిన విజేందర్‌ 13వ ఫైట్‌లో రష్యా బాక్సర్‌తో తలపడనున్నాడు. గోవాలోని మెజెస్టిక్‌ క్యాసినో నౌక పైభాగంలో శుక్రవారం ఈ పోరు జరగనుంది. 'బ్యాటిల్‌ ఆన్‌ షిఫ్‌'గా పిలుస్తున్న ఈ బౌట్‌లో వీరిద్దరూ సూపర్‌ మిడిల్‌ వెయిట్‌ (76కిలోలు) విభాగంలో పోటీపడుతున్నారు.

"అతడు(లాప్సన్‌) పొడగరే కావొచ్చు. కానీ ముందు నేను మెల్లగా మొదలుపెడతా. అతడిని కచ్చితంగా ఓడిస్తానన్న విశ్వాసం ఉంది. పొడవు ముఖ్యం కాదు. బాక్సింగ్‌లో‌ బలం, వ్యూహం కీలకం. నాకెంతో అనుభవం ఉంది. లాప్సన్‌ ఇంకా చిన్న కుర్రాడు. ఓటమెరుగని నా రికార్డు మార్చి 19 తర్వాతా కొనసాగుతుంది. అద్భుతమైన బౌట్‌ను మీరంతా చూడబోతున్నారు. ప్రత్యర్థి ఎంత బలంగా ఉంటే అతడిని ఓడించడం అంత సరదాగా ఉంటుంది. నేనిప్పుడు చాలా ఉత్సాహంగా ఉన్నా."

-విజేందర్, బాక్సర్

లాప్సన్‌ కూడా తక్కువేమీ అనడం లేదు. మాటల కన్నా చేతలే తన గురించి ఎక్కువగా చెబుతాయన్నాడు. "విజేందర్‌ మంచి ఫైటర్‌. నేనిక్కడికి అతడి జైత్రయాత్రను అడ్డుకోవడానికే వచ్చా. తొలి రౌండ్లలోనే అతడిని నాకౌట్‌ చేసేందుకు నేను సిద్ధం. సొంత ప్రేక్షకుల మధ్యే అతడిని ఓడించడం గొప్పగా ఉంటుంది. నన్ను ఎదుర్కొనేటప్పుడు విజేందర్‌కు కచ్చితంగా కఠినంగా అనిపిస్తుంది" అని అతడు పేర్కొన్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.