ETV Bharat / sports

ఫిఫా ప్రపంచకప్‌లో ధోనీ క్రేజ్‌ మామూలుగా లేదుగా... చెన్నై జెర్సీతో బ్రెజిల్‌కు మద్దతు! - దోహా స్టేడియంలో ధోని జెర్సీ

టీమ్​ఇండియా మాజీ సారథి ధోనీకి ఉన్న క్రేజ్​ అంతా ఇంతా కాదు. తన ఆటతో అందరినీ ఆకట్టుకున్న తలైవాపై తమకున్న అభిమానాన్ని ఫ్యాన్స్​ ఏదో ఒక రూపంలో చాటుకుంటారు. ఇలానే ఓ అభిమాని ఫిపా వరల్డ్​ కప్​ మ్యాచ్​లో సందడి చేశాడు.

ms-dhoni-fan-flaunts-csk-jersey-during-brazil-vs-serbia-match-in-qatar

author img

By

Published : Nov 26, 2022, 7:07 AM IST

FIFA World Cup 2022 Dhoni Craze :ఫిఫా ప్రపంచకప్‌లో భాగంగా సెర్బియాపై బ్రెజిల్‌ 2-0 తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. తన అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకొన్న బ్రెజిల్‌ ఆటగాడు రిచర్లీసన్‌ జట్టును విజయం వైపుగా నడిపించాడు. ఈ నేపథ్యంలో గురువారం దోహా స్టేడియంలో టీమ్ఇండియా మిస్టర్‌ కూల్‌ మహేంద్రసింగ్‌ ధోనీ అభిమానుల సందడి కనిపించింది.

స్టాండ్స్‌లో ఉన్న ఓ భారతీయ అభిమాని చెన్నై జెర్సీతో మ్యాచ్‌కు హాజరయ్యాడు. ఈ మ్యాచ్‌లో గెలుపునకు తోటి ప్రేక్షకులతో కలిసి సంబరాలు చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఓ బ్రెజిల్‌ అభిమానితో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చాడు. ఆ సమయంలో ధోనీ పేరుతో ఉన్న జెర్సీని చూపుతూ తన అభిమానాన్ని చాటుకున్నాడు. వీటిని చెన్నై జట్టు ట్విటర్‌లో పంచుకోవడంతో వైరల్‌గా మారాయి. ఈ పోస్ట్‌ ధోనీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సెర్బియాపై విజయం అనంతరం స్విట్జర్లాండ్‌ను ఈ జట్టు ఢీకొట్టనుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.