భారత బాక్సింగ్ ఫెడరేషన్(బీఎఫ్ఐ)పై అసహనం వ్యక్తం చేస్తూ.. హైదరాబాద్ బాక్సర్ నిఖత్ జరీన్ రాసిన లేఖకు కేంద్ర క్రీడామంత్రి కిరణ్‌రిజిజు స్పందించారు. ఈ అంశాన్ని ఫెడరేషన్ దృష్టికి తీసుకెళ్తానని ఆమెకు హామీ ఇచ్చారు. ఆటగాళ్ల ఎంపిక ప్రక్రియలో క్రీడామంత్రి జోక్యమేమి ఉండదని ట్విట్టర్ వేదికగా తెలిపారు.
"దేశం, క్రీడలు, అథ్లెట్ల పట్ల అత్యుత్తమ నిర్ణయం తీసుకునేలా బాక్సింగ్ ఫెడరేషన్ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్తా. అయితే క్రీడాకారుల ఎంపిక విషయంలో క్రీడామంత్రి ప్రమేయం ఉండదు. ఒలింపిక్ చార్టర్ ప్రకారం ఈ అంశం స్వతంత్ర ప్రతిపత్తిగల స్పోర్ట్స్ ఫెడరేషన్ చేతిలోనే ఉంటుంది" - కిరణ్ రిజిజు, కేంద్ర క్రీడామంత్రి.
-
I'll surely convey to Boxing Federation to take the best decision keeping in mind the best interest of the NATION, SPORTS & ATHLETES. Although, Minister should not be involved in the selection of the players by the Sports Federations which are autonomous as per OLYMPIC CHARTER https://t.co/GqIBdtWRMp
— Kiren Rijiju (@KirenRijiju) October 18, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">I'll surely convey to Boxing Federation to take the best decision keeping in mind the best interest of the NATION, SPORTS & ATHLETES. Although, Minister should not be involved in the selection of the players by the Sports Federations which are autonomous as per OLYMPIC CHARTER https://t.co/GqIBdtWRMp
— Kiren Rijiju (@KirenRijiju) October 18, 2019I'll surely convey to Boxing Federation to take the best decision keeping in mind the best interest of the NATION, SPORTS & ATHLETES. Although, Minister should not be involved in the selection of the players by the Sports Federations which are autonomous as per OLYMPIC CHARTER https://t.co/GqIBdtWRMp
— Kiren Rijiju (@KirenRijiju) October 18, 2019
ట్రయల్స్ నిర్వహించకుండా మేరీకోమ్‌ను ఒలింపిక్స్‌కు పంపాలనుకుంది భారత బాక్సింగ్ సమాఖ్య(బీఎఫ్ఐ). ఈ అంశాన్ని తప్పుపట్టింది హైదరాబాద్ బాక్సర్ నిఖత్. తనకు న్యాయం చేయాలంటూ కేంద్రమంత్రి కిరణ్రిజిజుకు లేఖ రాసింది. రష్యా వేదికగా జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కూ సెలక్షన్ నిర్వహిస్తారని చెప్పి.. మేరీని టోర్నీకి పంపించారని తెలిపింది.
ఇదీ చదవండి: 'మేరీనే తీసుకోవాలనుకుంటే నేనెందుకు ఆడడం'