ETV Bharat / sports

'పంచ్ పవర్, వేగం ఏ మాత్రం తగ్గలేదు' - మైక్ టైసన్ లేటెస్ట్ న్యూస్

తనలో ఇంకా బాక్సింగ్ చేసే సత్తా తగ్గలేదని అంటున్నాడు దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్. తాజాగా ఓ ట్రైనింగ్ వీడియోను ఇన్​స్టాగ్రామ్​లో పంచుకున్నాడు.

టైసన్
టైసన్
author img

By

Published : May 12, 2020, 3:33 PM IST

బాక్సింగ్‌ లెజెండ్‌, మాజీ ప్రపంచ హెవీ వెయిట్ ఛాంపియన్ మైక్ టైసన్ తాజాగా మరో ట్రైనింగ్‌ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. తనలో ఇంకా బాక్సింగ్‌ చేసే సత్తా ఉందని అభిమానులకు చెప్పకనే చెప్పాడు. ఈ వీడియోను పోస్టు చేసిన మాజీ ఛాంపియన్‌‌ 'ఐయామ్‌ బ్యాక్‌' అంటూ క్యాప్షన్‌ ఇచ్చాడు.

53 ఏళ్ల టైసన్‌ గతవారం బాక్సింగ్‌ అభిమానుల దృష్టిని ఆకర్షించాడు. ఒక చిన్న వీడియోను అభిమానులతో పంచుకున్న ఆయన.. తనలో ఇంకా పంచింగ్‌ శక్తి తగ్గలేదని, తన వేగం కూడా అలాగే ఉందని సంకేతాలిచ్చాడు. ఆ వేగం, పంచింగ్‌ శక్తులే టైసన్‌ను డబ్ల్యూబీఏ, డబ్ల్యూసీ, ఐబీఎఫ్‌ టైటిల్స్‌ సాధించేలా చేశాయి.

ఈ సందర్భంగా టైసన్‌ మాట్లాడుతూ.. ఓ స్వచ్ఛంద సంస్థ కోసం విరాళాలు సేకరించేందుకు కొన్ని ఎగ్జిబిషన్ పోటీల్లో పాల్గొనాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. కాగా, టైసన్‌ 1986లో 20 ఏళ్ల వయసులో ట్రెవర్ బెర్బిక్‌ అనే బాక్సర్‌ను ఓడించి హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్‌ సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. తన కెరీర్‌లో మొత్తం 58 పోటీల్లో 50సార్లు విజయం సాధించి 2005లో రిటైరయ్యాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.