Melbourne Tennis 2022: అడిలైడ్ ఇంటర్నేషనల్ టైటిల్‌ను రెండోసారి గెలుచుకుంది ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ స్టార్ ఆష్లీ బార్టీ. మహిళల సింగిల్స్‌లో ఎలీనా రైబాకినాపై 6-3, 6-2 తేడాతో గెలిచి మూడేళ్లలో రెండు సార్లు ఈ టైటిల్‌ను సొంతం చేసుకున్న క్రీడాకారిణిగా నిలిచింది బార్టీ.
సిడ్నీ టెన్నిస్..
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొనడానికి ముందు బార్టీ.. సిడ్నీ టెన్నిస్ క్లాసిక్ టోర్నీలో పాల్గొనాల్సి ఉంది.
నాదల్ హవా..
మరోవైపు, మాజీ నంబర్ వన్ టెన్నిస్ ఆటగాడు రఫేల్ నాదల్.. మెల్బోర్న్లో జరిగిన ఏటీపీ కప్ టైటిల్ నెగ్గాడు. గత 19 ఏళ్లలో వరుసగా కనీసం ఒక ఏటీపీ టైటిల్ అయినా నెగ్గిన ఆటగాడిగా నిలిచాడు. అమెరికాకు చెందిన మాక్సీమ్ క్రెస్సీని 7-6(6), 6-3తో ఓడించాడు నాదల్. జనవరి 17న ప్రారంభం కానున్న ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు ముందు ఈ టైటిల్ నెగ్గడం గమనార్హం.
Bopanna Ramkumar Pair: తొలిసారి ఏటీపీ టూర్‌లో జట్టు కట్టిన రోహన్ బోపన్న- రామ్‌కుమార్ రామనాథన్(భారత్) ద్వయం అడిలైడ్ ఇంటర్నేషనల్ టెన్నిస్ టోర్నమెంట్ విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్స్‌లో టాప్ సీడ్ జంట ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా)-మార్సెలో మెలో (బ్రెజిల్)పై 7-6, 6, 6-1 తేడాతో గెలిచారు.
బోపన్నకు ఇది 20వ ఏటీపీ డబుల్స్ టైటిల్ కాగా.. రామ్నాథన్కు మొదటిది.
డబ్ల్యూటీఏ టోర్నీలో..
మెల్బోర్న్లో జరిగిన డబ్ల్యూటీఏ టోర్నీలో అమెరికాకు చెందిన క్రీడాకారిణి అమంద అనిసిమోవా విజయం సాధించింది. బెలారస్‌కు చెందిన అలియక్సంద్ర సస్నోవిచ్పై 7-5, 1-6, 6-4 తేడాతో గెలిచి రెండోసారి ఈ టైటిల్ సొంతం చేసుకుంది.
మరో టోర్నీ ఫైనల్స్‌లో..
ఆదివారం జరిగిన మరో టోర్నీ డబ్ల్యూటీఏ 500 ఫైనల్స్‌లో రెండో సీడ్ సిమోన హలెప్ విజయం సాధించింది. వెరానికపై 6-2, 6-3 తేడాతో గెలిచింది. మరోవైపు అడిలైడ్ ఇంటర్నేషనల్ మెన్స్ ఫైనల్లో కరెన్ ఖచనోవ్పై 6-4,6-4పై గెలిచాడు గాయెల్ మోన్పిల్స్.
ఇదీ చదవండి: