ETV Bharat / sports

జర్మన్‌ గ్రాండ్‌ప్రి: హామిల్టన్‌కు యువరేసర్​​ షాక్​ - రెడ్​బుల్​ యువ రేసర్​ వెర్​స్టాపెన్

జర్మనీ గ్రాండ్‌ప్రిలో​ ప్రపంచ ఛాంపియన్​ లూయిస్​ హామిల్టన్ ఓటమిపాలయ్యాడు. రేస్​ ముగిసేసరికి 9వ స్థానంలో నిలిచాడు. 21 ఏళ్ల రెడ్​బుల్​ యువ రేసర్​ వెర్​స్టాపెన్​ టైటిల్​ గెలుచుకున్నాడు.

జర్మన్‌ గ్రాండ్‌ప్రీ: హామిల్టన్‌కు షాకిచ్చిన యువరేసర్​​
author img

By

Published : Jul 29, 2019, 10:05 AM IST

జర్మనీ గ్రాండ్​ప్రిలో మరో సంచలన విజయం నమోదైంది. 21 ఏళ్ల డచ్​ రేసర్ వెర్​స్టాపెన్​​ విజేతగా నిలిచాడు. రేస్​ను గంట 44 నిముషాల 31.275 సెకన్లలో పూర్తిచేశాడీ యువ డ్రైవర్​. ఫలితంగా ఈ ఏడాది రెండో విజయం ఖాతాలో వేసుకున్నాడు. కెరీర్​లో ఇది ఏడో విజయం. నాలుగుసార్లు ఫార్ములావన్‌ ఛాంపియన్‌, ఫెరారీ డ్రైవర్‌ సెబాస్టియన్‌ వెటెల్‌ రెండో స్థానానికే పరిమితమయ్యాడు.

Max Verstappen wins thrilling German GP after Lewis Hamilton error
వెర్​స్టాపెన్

హామిల్టన్​ నిరాశ...

వర్షం కారణంగా ట్రాక్​ సరిగా అనుకూలించక స్టార్​ రేసర్లు ఒకరినొకరు ఢీకొట్టుకున్నారు. డిఫెండింగ్​ ఛాంపియన్​ హామిల్టన్​ అయితే కెరీర్​లో చెత్త ప్రదర్శన మూటగట్టుకున్నాడు. కెరీర్‌ 200వ రేసులో బరిలోకి దిగిన మెర్సిడెస్​ స్టార్​ హామిల్టన్‌ తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ స్టార్​ డ్రైవర్​ కారు ప్రమాదానికి గురవడం వల్ల ఆటను గంట 44 నిముషాల 50.942 సెకన్లలో పూర్తిచేశాడు. ఆలస్యంగా రేస్​ పూర్తిచేయడం వల్ల ఒక్క పాయింట్ కూడా​ లభించలేదు. చివరిగా ఆడిన 23 రేసుల్లో ఈ మెర్సిడెస్‌ డ్రైవర్‌ ఒక్క పాయింట్‌ అయినా గెలవలేకపోవడం ఇదే తొలిసారి.

జర్మన్‌ గ్రాండ్‌ప్రీ: హామిల్టన్‌కు షాకిచ్చిన యువరేసర్​​
హామిల్టన్​

నాలుగు సార్లు ఛాంపియన్​ వెటెల్‌... గంట 44నిముషాల 38.608 సెకన్ల టైమింగ్‌తో రెండో స్థానానికి పరిమితమయ్యాడు. టోరో రోసో డ్రైవర్‌ డానిల్‌ క్వియాట్‌ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ట్రాక్​పై పలువురి కార్లు ఢీకొనడం వల్ల కొందరు స్టార్​ డ్రైవర్లు అసలు రేసునే పూర్తి చేయలేకపోయారు. బొటాస్‌ (మెర్సిడెస్‌), హుల్కెన్‌బర్గ్‌ (రెనౌ), రికియార్డో (రెనౌ)లు రేసు నుంచి వైదొలిగారు. ఆగస్టు 4న హంగేరి గ్రాండ్‌ప్రి ప్రారంభం కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Mumbai, July 18 (ANI): Bollywood actor Isha Gupta was seen outside a restaurant in Mumbai. She posed and smiled for shutterbugs. Meanwhile, Khushi Kapoor was also spotted at Juhu. She wore casual tee and track pants.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.