భారత మహిళా స్టార్ బాక్సర్లు మేరీకోమ్-నిఖత్ జరీన్‌ల మధ్య మాటల యుద్ధం గత కొంతకాలంగా నడుస్తూ ఉంది. వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్ కోసం చైనాలో జరిగే క్వాలిఫయింగ్ ఈవెంట్‌కు మేరీ(51 కిలోల విభాగం)ని పంపాలని భారతీయ బాక్సింగ్ ఫెడరేషన్(బీఎఫ్‌ఐ) నిర్ణయించింది.
ఈ విషయాన్ని తెలంగాణ బాక్సర్ నిఖత్ వ్యతిరేకించింది. తానూ ఇదే విభాగంలో ఉన్నానని, తమ మధ్య ఒలింపిక్స్ సెలక్షన్ ట్రయల్ నిర్వహించాలంటూ బీఎఫ్ఐని కోరింది. ఈ విషయంపై స్పందించిన ఫెడరేషన్.. వారి మధ్య ట్రయల్స్‌కు రంగం సిద్ధం చేసింది. అధికారిక ప్రకటన రాకపోయినా, డిసెంబరు చివరి వారంలో వీరు తలపడే అవకాశముంది.
![marykom](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5015654_mary-kom-1.jpg)
డిసెంబర్ 2వ తేదీ నుంచి 21వ తేదీ వరకూ ఆలిండియా బాక్సింగ్ లీగ్(ఐబీఎల్) జరుగనున్న నేపథ్యంలో ఆ తర్వాతే మేరీకోమ్-జరీన్‌ల మెగా ఫైట్ ట్రయల్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. అందులో గెలిచిన బాక్సర్ ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ ఈవెంట్‌కు అర్హత సాధిస్తారు.