ETV Bharat / sports

టెన్నిస్ భామ షరపోవాపై ఇండియాలో చీటింగ్‌ కేసు - tennis players sharapova

Maria Sharapova Cheating Case: రష్యన్‌ టెన్నిస్‌ దిగ్గజం మరియా షరపోవాతో పాటు ఫార్ములావన్‌ మాజీ చాంపియన్‌ మైకెల్‌ షుమాకర్‌లపై చీటింగ్‌, క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. దిల్లీకి చెందిన షఫాలీ అగర్వాల్‌ అనే మహిళ ఫిర్యాదు మేరకు గురుగ్రామ్ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

sharapova
షరపోవా
author img

By

Published : Mar 17, 2022, 5:26 PM IST

Maria Sharapova Cheating Case: రష్యా టెన్నిస్‌ దిగ్గజం మారియా షరపోవా, ఫార్ములా వన్‌ రేసింగ్‌ మాజీ ఛాంపియన్‌ మైఖేల్‌ షుమాకర్‌తో సహా మరికొంత మంది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులపై బుధవారం గురుగ్రామ్​‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. దిల్లీలోని చత్తార్‌పూర్‌ మినీ ఫామ్‌కు చెందిన షఫాలీ అగర్వాల్‌ అనే మహిళ ఫిర్యాదు మేరకు కోర్టు ఆదేశాలతో వారిపై చీటింగ్‌, క్రిమినల్‌ కేసులు నమోదు చేసినట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు.

సుమారు రూ.80 లక్షలు తీసుకుని..

రియల్‌టెక్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ తమని మోసం చేసిందని.. సెక్టార్‌-73లో షరపోవా ప్రాజెక్ట్‌ పేరిట షుమాకర్‌ టవర్స్‌ అపార్ట్‌మెంట్‌లో ఓ ఫ్లాట్‌ కోసం తమవద్ద నుంచి కంపెనీ ప్రతినిధులు సుమారు రూ.80లక్షలు తీసుకున్నారని చెప్పారు. దాన్ని 2016లోనే అందిస్తామని చెప్పినా ఇంతవరకూ తమకు ఎలాంటి లబ్ధి చేకూరలేదని షఫాలీ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ప్రాజెక్ట్‌లో షరపోవా, షుమాకర్‌ భాగస్వాములుగా ఉండడమే కాకుండా ప్రచార కర్తలుగా ఉన్నారని చెప్పారు. అలాగే ఆ సంస్థ ప్రచార చిత్రాల్లోనూ తప్పుడు ప్రమాణాలు చేశారని వివరించారు. షరపోవా, షుమాకర్‌లు కొనుగోలుదారులతో డిన్నర్ పార్టీల్లోనూ పాల్గొన్నారని, అలాగే ఆ ప్రాజెక్ట్‌లో టెన్నిస్‌ అకాడమీతో పాటు క్రీడా క్లబ్‌ నిర్వహిస్తామనే తప్పుడు ప్రమాణాలు చేశారన్నారు.

ఈ విషయంలో సదరు కంపెనీ ప్రతినిధులను ఎన్నిసార్లు సంప్రదించినా తమకు న్యాయం జరగలేదని, దీంతో జాతీయ వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేసినా ఉపయోగం లేకపోయిందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే కోర్టును ఆశ్రయించగా వారిపై చీటింగ్‌, క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ఆదేశించినట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి: సన్​రైజర్స్​ సందడి.. రంగంలోకి స్టెయిన్, భువీ.. కేన్​ మామ ప్రాక్టీస్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.