జర్మనీలోని మూనిక్లో జరుగుతున్న అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్(ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచకప్‌లో భారత షూటర్ మను బాకర్ నాలుగో స్థానంలో నిలిచింది. అయినప్పటికీ టోక్యో ఒలింపిక్స్ కోటాలో 7 స్థానాన్ని పదిల పరచుకుంది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ ఈవెంట్లో 201 పాయింట్లు సాధించింది.
10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ విభాగంలో భారత్ తరఫున ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి మహిళ మనునే. పిస్టోల్‌లో లోపం తలెత్తడం వల్ల మను బాకర్ పాయింట్ల సాధనలో వెనుకబడింది. ఈ కారణంగా ఆమె అసంతృప్తి చెందింది. పోడియం దగ్గరకు కూడా రాలేదు.
పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ విభాగంలో ఇప్పటికే సౌరభ్ చౌదరి, అభిషేక్ వర్మ ఒలింపిక్స్ బెర్త్ ఖరారు చేసుకున్నారు. వీరు ఫిబ్రవరిలో దిల్లీలో జరిగిన ప్రపంచకప్‌లో సత్తాచాటి ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు.