ETV Bharat / sports

రిటైర్మెంట్ ఇప్పట్లో లేదు.. ఇంకొన్నాళ్లు ఆడుతా: మెస్సీ - అర్జెంటీనా పై చేయి

ప్రపంచకప్‌ తర్వాత మెస్సీ రిటైర్మెంట్‌ ప్రకటిస్తాడని ఆందోళన చెందుతున్న అభిమానులకు ఊరటనిచ్చే కబురు ఇది. మెస్సీ ఇప్పట్లో రిటైర్మెంట్‌ ప్రకటించడం లేదట. ప్రపంచకప్‌ ఫైనల్‌ తర్వాత అతడే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు.

lionel messi
మెస్సి
author img

By

Published : Dec 19, 2022, 1:21 PM IST

FIFA World Cup 2022 Messi Retirement : ప్రపంచకప్‌ విజయం తర్వాత అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు మెస్సీ వీడ్కోలు పలుకుతాడని భారీగా ప్రచారం జరిగింది. దీనికి ఆదివారం అర్ధరాత్రి మ్యాచ్‌ అనంతరం మెస్సీ వివరణ ఇచ్చాడు. రిటైర్మెంట్‌ ఇప్పట్లో లేనట్లే అని తేల్చిచెప్పాడు. డిసెంబర్‌ 18న నరాలు తెగే ఉత్కంఠ మధ్య అర్జెంటీనాకు ఈ సాకర్‌ మాంత్రికుడు అద్భుత విజయాన్నందించాడు.

అనంతరం మాట్లాడాడు. "నేను నా కెరీర్‌ను దీంతో ముగిద్దామని అనుకొన్నాను. ఇప్పటి వరకు నా కెరీర్‌లో అందనది ఇదే. ఇకపై నేను ఏమీ అడగను. నేను కోపా సాధించగలిగాను. ఇప్పుడు ప్రపంచకప్‌ కోసం తీవ్రంగా పోరాడాను. నా కెరీర్‌ చరమాంకంలో దీన్ని సాధించాను. కానీ నేను ఫుట్‌బాల్‌ను ప్రేమిస్తాను. ప్రపంచ ఛాంపియన్‌గా మరికొన్ని గేమ్స్‌ ఆడాలనుకుంటున్నాను" అంటూ మెస్సీ పేర్కొన్నాడు.

మరోవైపు ఇన్‌స్టాలో కూడా మెస్సీ తన విజయాన్ని పంచుకున్నాడు. "ప్రపంచ ఛాంపియన్‌ కావాలని చాలా సార్లు కలలుగన్నాను. సాధించలేకపోయాను. కానీ, ఇప్పుడు దీన్ని నమ్మలేకపోతున్నా. మమ్మల్ని నమ్మిన వారికి, నాకు మద్దుతు ఇచ్చినవారికి, నా కుటుంబానికి ధన్యవాదాలు. అర్జెంటీనా సమష్టిగా పోరాడితే అనుకొన్న లక్ష్యాన్ని సాధించగలదని మరోసారి నిరూపించాము. వ్యక్తుల కంటే ఎక్కువగా ఈ ఘనత జట్టుకే చెందుతుంది. అర్జెంటీనా వాసుల కల కోసం సమష్టిగా పోరాడటంలో ఉన్న బలం ఇది" అంటూ చెప్పుకొచ్చాడు

విశేషాలకు కొదవలేని విజయం..
ఈ ప్రపంచకప్‌తో మెస్సీ ఫుట్‌బాల్‌లో సాధించలేనిదంటూ ఏమీ లేకుండాపోయింది. ప్రపంచకప్‌ టోర్నీల్లో రెండుసార్లు గోల్డెన్‌ బాల్‌ అవార్డు అందుకొన్న ఏకైక ఆటగాడు మెస్సీనే. ఏడు సార్లు బాలెన్‌ డి ఓర్‌ అవార్డు అందుకొన్న మెస్సి అండర్‌ -20 ప్రపంచకప్‌, ఒలింపిక్‌ గోల్డ్‌, కోపా అమెరికా, ఫిఫా ప్రపంచకప్‌ అందుకొన్నాడు.

మెస్సీ 2022 ప్రపంచకప్‌ టోర్నీకి ముందు ఆడిన వాటిల్లో ఒక్కదానిలో కూడా నాకౌట్‌ దశల్లో గోల్స్‌ చేయలేదు. కానీ, 2022 ప్రపంచకప్‌లో ప్రతి దశలో గోల్స్‌ చేశాడు. ఈ సీజన్‌లో మెస్సీ భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు. మొత్తం 29 మ్యాచ్‌లు ఆడిన లియో 24 గోల్స్‌ చేశాడు. 18 గోల్స్‌కు అసిస్ట్‌ చేయడం విశేషం. అంటే మొత్తం 42 గోల్స్‌లో మెస్సీ పాత్ర ఉందన్నమాట. ఈ సీజన్‌లో 23 సార్లు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌లను అందుకొన్నాడు. 8వ సారి బాలెన్‌ డీ ఓర్‌ రేసులో ముందున్నాడు.

మెస్సీకి దాసోహమైన ప్రపంచకప్‌ రికార్డులు ఇవే..

  • అత్యధిక మ్యాచ్‌(26)లు ఆడిన ఆటగాడు.
  • అత్యధిక మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌(11)లు పొందిన ఆటగాడు.
  • అత్యధిక గోల్డెన్‌ బాల్‌ అవార్డు(2)లు పొందిన ఆటగాడు. అతిపెద్ద వయస్సులో ఈ అవార్డు అందుకొన్నది కూడా మెస్సీనే.
  • ప్రపంచకప్‌ టోర్నీల్లో అత్యధిక నిమిషాలు(2,314) ఆడిన ఆటగాడు.
  • అత్యధిక గోల్స్‌ + అసిస్ట్‌ చేసిన ఆటగాడు కూడా మెస్సీనే
  • గోల్స్‌ చేయడానికి అత్యధిక అవకాశాలు సృష్టించిన ఆటగాడు
  • అత్యధిక టేక్‌ ఆన్స్‌ (ప్రత్యర్థి నుంచి బాల్‌ను ఆధీనంలోకి తీసుకోవడం) చేసిన ఆటగాడు కూడా మెస్సీనే.
  • కెప్టెన్‌గా అత్యధిక ప్రపంచకప్‌ మ్యాచ్‌లు(19) ఆడిన ప్లేయర్‌.
  • ప్రపంచకప్‌లో ఐదు అంతకంటే ఎక్కువ గోల్స్‌ చేసిన అతిపెద్ద వయస్కుడు మెస్సీనే. ప్రస్తుతం అతడి వయస్సు 35 ఏళ్ల 178 రోజులు.
  • ప్రపంచకప్‌ ఐదు రౌండ్లలో గోల్స్‌ చేసిన ఏకైక ఆటగాడు మెస్సీనే.
  • యూఈఎఫ్‌ఏ ఛాంపియన్స్‌ లీగ్‌, ఫిఫా వరల్డ్‌కప్‌, బాలెన్‌ డి ఓర్‌ సాధించిన నాలుగో ఆటగాడు మెస్సీనే. అంతకు ముందు రివాల్డో(బ్రెజిల్‌), రొనాల్డిన్హో (బ్రెజిల్‌), జినెదిన్‌ జిదానే (ఫ్రాన్స్‌) మాత్రమే ఉన్నారు.

వరల్డ్‌కప్‌ 2022 అవార్డులు

  • గోల్డెన్‌ బాల్‌ (బెస్ట్‌ ప్లేయర్‌)- లియోనల్‌ మెస్సీ (7 గోల్స్‌)- అర్జెంటీనా
  • గోల్డెన్‌ బూట్‌ (టాప్‌ స్కోరర్‌)- కైలియన్‌ ఎంబాపె- 8 గోల్స్‌- ఫ్రాన్స్‌
  • గోల్డెన్‌ గ్లౌవ్‌ (బెస్ట్‌ గోల్‌కీపర్‌)- మార్టినెజ్‌ (అర్జెంటీనా; 34 సార్లు గోల్స్‌ నిలువరించాడు)
  • బెస్ట్‌ యంగ్‌ ప్లేయర్‌- ఎంజో ఫెర్నాండెజ్‌ (అర్జెంటీనా)
  • మ్యాన్‌ ఆఫ్‌ ద ఫైనల్‌- లియోనల్‌ మెస్సీ
  • ఫెయిర్‌ ప్లే అవార్డు- ఇంగ్లాండ్‌

ఎవరికెంత వచ్చాయంటే..

  • విజేత: అర్జెంటీనా - 4 కోట్ల 20 లక్షల డాలర్లు (రూ. 347 కోట్లు)
  • రన్నరప్‌: ఫ్రాన్స్‌ -3 కోట్ల డాలర్లు (రూ. 248 కోట్లు)
  • మూడో స్థానం: క్రొయేషియా -2 కోట్ల 70 లక్షల డాలర్లు (రూ. 223 కోట్లు)
  • నాలుగో స్థానం: మొరాకో -2 కోట్ల 50 లక్షల డాలర్లు (రూ. 206 కోట్లు)
  • క్వార్టర్‌ ఫైనల్స్‌లో ఓడిన జట్లకు (4) -కోటీ 70 లక్షల డాలర్ల చొప్పున (రూ. 140 కోట్ల చొప్పున)
  • ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో ఓడిన జట్లకు (8) -కోటీ 30 లక్షల డాలర్ల చొప్పున (రూ. 107 కోట్ల చొప్పున)
  • గ్రూప్‌ లీగ్‌ దశలో నిష్క్రమించిన జట్లకు (16) -90 లక్షల డాలర్ల చొప్పున (రూ. 74 కోట్ల చొప్పున)
  • ఇవీ చదవండి:
  • హోరాహోరీగా ప్రపంచకప్ ఫైనల్.. విశ్వవిజేతగా అర్జెంటీనా
  • ఫిఫా వరల్డ్​ కప్​లో మెరవనున్న దీపికా పదుకొణె ఏం చేయబోతోందో తెలుసా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.