ETV Bharat / sports

Korea Open: రెండో రౌండ్​కు దూసుకెళ్లిన సింధు, శ్రీకాంత్​ - korea open news

Korea Open Sindhu: కొరియా ఓపెన్​లో భారత స్టార్​ షట్లర్లు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్​ రెండో రౌండ్​కు దూసుకెళ్లారు.

Korea Open
Korea Open
author img

By

Published : Apr 6, 2022, 10:55 AM IST

Korea Open Sindhu: భారత స్టార్​ బ్యాడ్మింటన్​ ప్లేయర్​, మూడో సీడ్​ పీవీ సింధు.. కొరియా ఓపెన్​ను ఘనంగా ప్రారంభించింది. అమెరికాకు చెందిన లారెన్​ లామ్​ను వరుస సెట్లలో ఓడించి.. రెండో రౌండ్​కు దూసుకెళ్లింది. రెండు ఒలింపిక్​ పతకాలు సాధించిన సింధు.. లామ్​పై 21-15,21-14 తేడాతో గెలిచింది. మ్యాచ్​ 34 నిమిషాల్లోనే ముగియడం విశేషం. జపాన్​కు చెందిన అయా ఒహోరితో రెండో రౌండ్​లో తలపడనుంది భారత స్టార్​ షట్లర్​.

పురుషుల సింగిల్స్​లో ప్రపంచ మాజీ నెం.1 కిదాంబి శ్రీకాంత్​ కూడా రెండో రౌండ్​లో అడుగుపెట్టాడు. మలేసియాకు చెందిన డారెన్​ లీపై 22-20,21-11 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించాడు. ఈ మ్యాచ్​ 40 నిమిషాల్లోనే ముగిసింది. తదుపరి రౌండ్​లో ఇజ్రాయెల్​కు చెెందిన మిషా జిల్బర్​మ్యాన్​తో అమీతుమీ తేల్చుకోనున్నాడు. పురుషుల డబుల్స్​లో ఎంఆర్​ అర్జున్​, ధ్రువ్​ కపిల జోడీకి తొలి రౌండ్​లో వాకోవర్​ లభించింది. రెండో రౌండ్​లో ఇండోనేసియా జోడీ మహ్మద్​ అహ్సన్​- హేంద్రా సేటియావాన్​తో తలపడనుంది.

ఇవీ చూడండి: 20 ఏళ్లకే ప్రపంచ నెం.1.. తొలి క్రీడాకారిణిగా రికార్డు!

యంగ్​ క్రికెటర్​, తెలుగు హీరోయిన్​ మధ్య సమ్​థింగ్​ సమ్​థింగ్?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.