ETV Bharat / sports

ఆస్తులు అమ్మి శిక్షణ, అంతిమ్ విజయంతో వారి కల సాకారం

author img

By

Published : Aug 22, 2022, 7:32 AM IST

అంతిమ్‌ పంఘాల్‌. అండర్‌-20 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం (53 కేజీ) గెలిచిన తొలి భారత అమ్మాయిగా ఈమె పేరు ఇప్పటికే మార్మోగిపోతోంది. తన నేపథ్యం తెలిస్తే ఈ తరంలో మరింత స్ఫూర్తి కలుగుతుంది.

antim panghal wrestler
ఆస్తులు అమ్మి శిక్షణ, అంతిమ్ విజయంతో వారి కల సాకారం

Antim Panghal wrestler : అంతిమ్‌ హరియాణా అమ్మాయి. హిస్సార్‌ జిల్లాలోని భగానా గ్రామంలో పుట్టి పెరిగింది. అంతిమ్‌ అంటే చివరి అని అర్థం. తల్లిదండ్రులు రామ్‌ నివాస్‌, కృష్ణ కుమారి.. అంతిమ్‌ కంటే ముందే ముగ్గురు అమ్మాయిలకు జన్మనిచ్చారు. హిస్సార్‌ జిల్లాలో లింగ వివక్ష అంతా ఇంతా కాదు. 1000 మంది పురుషులకు 872 మంది మహిళలే ఉన్నారు. అంతిమ్‌ జననం, అంటే నాలుగో సంతానంగా కూడా అమ్మాయి పుట్టడం తల్లిదండ్రులకు ఎక్కువ సంతోషాన్నివ్వలేదు.

మగబిడ్డ కోసం తపించిన వాళ్లు రాష్ట్రంలో ఉన్న సంప్రదాయం ప్రకారం ఆమెకు 'అంతిమ్‌' అని పేరు పెట్టారు. ఆమే తమ చివరి అమ్మాయి కావాలన్నది వారి ఆశ. కానీ అప్పటికి చెడు సంప్రదాయాన్ని పాటించినా.. ఆమె తల్లిదండ్రులెప్పుడూ తమ పిల్లల పట్ల వివక్షను ప్రదర్శించలేదు. అంతా ఆడ పిల్లలే అని బాధపడలేదు. వారికి ఎల్లప్పుడూ మద్దతుగా నిలిచారు. వాళ్ల పెద్దమ్మాయి సరిత జాతీయ స్థాయి కబడ్డీ క్రీడాకారిణి.

రెజ్లింగ్‌ను ఎంచుకున్న అంతిమ్‌కు ఎంతో మద్దతుగా నిలిచాడు రామ్‌ నివాస్‌. ఖర్చుకూ వెనుకాడలేదు. అమ్మాయిలకు రెజ్లింగ్‌ ఎందుకంటే ఇరుగు పొరుగు విమర్శించినా వెనక్కి తగ్గలేదు. రెజ్లింగ్‌ సాధన కోసం అంతిమ్‌ను తన గ్రామం నుంచి 20 కిలోమీటర్ల దూరంలోని హిస్సార్‌ పట్టణానికి రోజూ తీసుకెళ్లేవాడు. తర్వాత నివాసాన్నే హిస్సార్‌కు మార్చేశాడు. ఖర్చుల కోసం తన వద్ద ఉన్న వాహనాలనూ అమ్మేశాడు. కుమార్తెపై అతడి నమ్మకం వృథా కాలేదు. 2018లో అండర్‌-15 జాతీయ టైటిల్‌ గెలిచిన అంతిమ్‌ ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. రోజురోజుకూ మెరుగవుతూ.. ఇప్పుడిలా ప్రపంచ వేదికపై సగర్వంగా నిలబడింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.