ETV Bharat / sports

కిదాంబి శ్రీకాంత్​ శుభారంభం.. లక్ష్యసేన్​కు నిరాశ - జపాన్ ఓపెన్​ టోర్నీ లక్ష్యసేన్​

జపాన్​ ఓపెన్​ సూపర్​ 750 టోర్నమెంట్​లో భాగంగా బుధవారం జరిగిన పోటీల్లో భారత స్టార్ షట్లర్​ కిదాంబి శ్రీకాంత్ శుభారంభం చేయగా, లక్ష్యసేన్​కు నిరాశ ఎదురైంది.

Indian shuttler Kidambi Srikanth
Indian shuttler Kidambi Srikanth
author img

By

Published : Aug 31, 2022, 1:08 PM IST

Kidambi Srikanth wins in japan super 750: జపాన్​ ఓపెన్​ సూపర్​ 750 టోర్నమెంట్ ఆసక్తికంగా సాగుతోంది. ఈ టోర్నీలో భారత్ నుంచి 4 సింగిల్స్ ప్లేయర్లు, 6 డబుల్స్ జోడీలు బరిలో దిగాయి. కాగా, ఇందులో భాగంగా బుధవారం జరిగిన పోటీల్లో ​ భారత స్టార్ షట్లర్​ కిదాంబి శ్రీకాంత్ శుభారంభం చేశాడు. వరల్డ్​ ​నెం 4 లీ జీ జియాపై విజయం సాధించాడు. 22-20,23-21 తేడాతో గెలిచాడు.

37 నిమిషాల పాటు సాగింది ఈ మ్యాచ్​. ఇదే పోటీల్లో కామన్​వెల్త్​ గేమ్​ ఛాంపియన్​ లక్ష్యసేన్​కు చేదు అనుభవం ఎదురైంది. ఓపెనింగ్​ రౌండ్​లో ఓటమి పాలయ్యాడు. వరల్డ్​ నెం 21 కెంటా నిషిమోటొ చేతిలో 21-18,14-21,13-21 తేడాతో ఓటమిని చవి చూశాడు.మిక్స్​డ్ డబుల్స్​లో భారత్​ డబుల్స్​ జోడీ జూహీ దివాంగన్​, వెంకట్​ గౌరవ్ ప్రసాద్... చైనాకు చెందిన ద్వయం జెంగ్​(Zheng Si Wei), హువాంగ్​(Huang Ya Qiong) చేతిలో 11-21 10-21తేడాతో ఓడిపోయారు. ఎమ్​ఆర్​ అర్జున్, ధృవ్​ కపిలాల జోడీ సైతం కొరియాకు చెందన చోయ్​ సొల్​ గ్యూ, కిమ్​ వొన్​ హోల జోడి చేతిలో ​ 21-19 21-23 15-21కు ఓటమి పాలయ్యారు.

ఇదీ చదవండి:

న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్​ ఆటకు వీడ్కోలు

బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​తో శుభమన్​ గిల్​ డేటింగ్, మరి సచిన్​ కుమార్తె పరిస్థితేంటో

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.