Lakshya Sen Japan Open : భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్‌కు షాక్ తగిలింది. అతడు జపాన్ ఓపెన్ సూపర్ 750లో ఫైనల్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించాడు. శనివారం ఇండోనేసియా షట్లర్ జొనాథన్ క్రిస్టీతో జరిగిన సెమీఫైనల్స్‌లో ఓడిన సేన్.. అనూహ్యంగా ఇంటిబాట పట్టాడు.
తొలి ఆటలో హోరాహోరీగా ఆడిన సేన్.. 21-15 తేడాతో వెనుకబడ్డాడు. ఆ తర్వాత రౌండ్లో రెచ్చిపోయిన సేన్..13-21 తేడాతో రెండో గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే గేమ్ డిసైడర్ అయిన మూడో రౌండ్లో ప్రత్యర్థి జొనాథన్.. తన జోరును ప్రదర్శించాడు. ఈ క్రమంలో 21-16 తేడాతో లక్ష్యసేన్‌ను ఓడించి.. జోనాథన్ ఫైనల్లో అడుగుపెట్టాడు.
Canada Open 500 Badminton 2023 : కాగా లక్ష్యసేన్ ఇటీవలె కెనడా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీ కైవసం చేసుకున్నాడు. ఆ టోర్నీ ఫైనల్లో తన ప్రత్యర్థి.. ప్రపంచ పదో ర్యాంకర్ చైనా ఆటగాడు షై ఫెంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు సెట్లలో 21-18, 22-20 తేడాతో విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచాడు. ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ 2022 టోర్నీలో విజయం సాధించిన తర్వాత లక్ష్యసేన్.. రెండుసార్లు బీడబ్ల్యూఎఫ్ ఛాంపియన్‌గా నిలిచాడు.
- జపాన్ ఓపెన్ 750లో 32వ రౌండ్లో లక్ష్యసేన్.. భారత షట్లర్ రజావత్‌తో తలపడ్డాడు. ఈ పోరులో 21-15తో మొదటి గేమ్ గెలుచుకున్న లక్ష్య.. రెండో రౌండ్లో 12-21 తేడాతో వెనుకబడ్డాడు. దీంతో ఆట మూడో రౌండ్‌కు దారితీసింది. గేమ్ డిసైడర్ రౌండ్లో ఇద్దరు ఆటగాళ్లు నువ్వా - నేనా అన్నట్లుగా తలపడ్డారు. ఆద్యంతం హోరాహోరిగా సాగిన మూడో రౌండ్లో లక్ష్యసేన్.. పుంజుకొని 24-22తో గెలుపొందాడు.
- ఇక 16వ రౌండ్లో లక్ష్యసేన్.. జపాన్ ఆటగాడు సునెయమను ఢీ కొట్టాడు. ఈ గేమ్‌లో రెండు రౌండ్లలో కూడా ప్రత్యర్థిపై లక్ష్య ఆధిపత్యం చలాయించాడు. దీంతో 21-14, 21- 16 తేడాతో సునాయసంగా విజయం సాధించి క్వార్టర్స్ ఫైనల్స్‌లో అడుగుపెట్టాడు.
- క్వార్టర్స్ ఫైనల్స్‌లో జపాన్ ప్లేయర్ కొకి వతనబెపై.. లక్ష్యసేన్ చెలరేగాడు. వరుసగా రెండు రౌండ్లలోనూ 21-15, 21-19 తేడాతో గెలిచి.. సెమీ ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. కాగా శనివారం జరిగిన సెమీస్‌లో ఓడిపోయి ఇంటి బాట పట్టాడు.
Satwik Chirag Japan Open : మరోవైపు ఇదే టోర్నీలో భారత స్టార్ డబుల్స్ .. సాత్విక్ - చిరాగ్ శెట్టి జోడీకి క్వార్టర్స్‌లోనే నిరాశ ఎదురైంది. చైనీస్ తైపీకి చెందిన లీ యాంగ్- వాంగ్ లిన్ చేతిలో 15-21, 25-23, 16-21 తేడాతో ఓడిపోయారు.