ఆసియా ఛాంపియన్షిప్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్ జరిగిన తీరుపై భారత స్టార్ షట్లర్, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు ఆవేదన వ్యక్తం చేసింది. ప్రపంచ నంబర్ 2 అకానె యమగూచిపై గెలిచి తాను ఫైనల్‌కు వెళ్లాల్సిందని, మ్యాచ్ కొనసాగుతున్న సమయంలో రిఫరీ తీసుకున్న నిర్ణయం సరికాదని పేర్కొంది. ఆ నిర్ణయం.. ఆసియా ఛాంపియన్‌షిప్‌లో పసిడి నెగ్గాలన్న కలను చెరిపేసిందని వ్యాఖ్యానించింది.
"సర్వీస్ చేసేటప్పుడు ఎక్కువ సమయం తీసుకుంటున్నావని రిఫరీ నాతో చెప్పాడు. అయితే, నేను సర్వీస్ చేసే సమయానికి ప్రత్యర్థి సిద్ధంగా లేదు. కానీ, నా మాట పట్టించుకోకుండా యమగూచికి పాయింట్ ఇచ్చారు. ఇది అన్యాయం. సెమీఫైనల్లో ఓటమికి ఇదో కారణం కావచ్చు. రెండో గేమ్‌లో 14-11తో ఆధిక్యంలో ఉన్న సమయంలో ఇది జరిగింది. లేదంటే నేను జోరులో 15-11తో విజయానికి చేరువయ్యేదాన్ని. అనవసరంగా ఒక పాయింట్ కోల్పోవటం వల్ల స్కోరు 14-12గా మారింది. ఆమెకు రిఫరీ ఇచ్చిన పాయింట్ న్యాయమైంది కాదు. నేను ఈ మ్యాచ్‌లో గెలిచి ఫైనల్‌కు వెళ్లాల్సింది. ఈ విషయంపై చీఫ్ రిఫరీకి కూడా ఫిర్యాదు చేశా. కానీ, అప్పటికే పాయింట్ ఇచ్చేశారు కదా అని బదులిచ్చారు. ఒక చీఫ్ రిఫరీగా కనీసం ఎక్కడ తప్పు జరిగిందో అని పరిశీలించాల్సింది."
- పీవీ సింధు, భారత షట్లర్.
రిఫరీ నిర్ణయంతో సింధూ నిరాశకు లోనైనట్లు తెలిపారు ఆమె తండ్రి పీవీ రమణ. 'ఈసారి పసిడి గెలుస్తాననే పూర్తి నమ్మకంతో ఉంది. అందుకే తీవ్ర నిరాశకు గురైంది. నాతో మాట్లాడుతూ కంటతడి పెట్టుకుంది. అది జరిగిపోయిన విషయం అని, దానిని మర్చిపోవాలని సూచించా. రిఫరీ తీసుకున్న నిర్ణయం సరికాదు. ఆమె సమయం ఎక్కువ తీసుకుంటే ఎల్లో కార్డుతో హెచ్చరించాలి. అలాగే చేస్తుంటే రెడ్ కార్డు చూపించాక పాయింట్ ఇవ్వాలి. కానీ, అలాంటిది ఏమీ జరగలేదు.' అని పేర్కొన్నారు.
-
Shocked by the horrific discussion of the empire @Badminton_Asia where empire has give a fault to @Pvsindhu1 when her opponent is not ready. Sindhu was 1 game up & 14-11 up and was a song to win the Semifinals, with this discussion Yamaguchi's won!! 😡😡@bwfmedia pic.twitter.com/txkdksKeC5
— Pradeep Raju (@kpradeepraju) April 30, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Shocked by the horrific discussion of the empire @Badminton_Asia where empire has give a fault to @Pvsindhu1 when her opponent is not ready. Sindhu was 1 game up & 14-11 up and was a song to win the Semifinals, with this discussion Yamaguchi's won!! 😡😡@bwfmedia pic.twitter.com/txkdksKeC5
— Pradeep Raju (@kpradeepraju) April 30, 2022Shocked by the horrific discussion of the empire @Badminton_Asia where empire has give a fault to @Pvsindhu1 when her opponent is not ready. Sindhu was 1 game up & 14-11 up and was a song to win the Semifinals, with this discussion Yamaguchi's won!! 😡😡@bwfmedia pic.twitter.com/txkdksKeC5
— Pradeep Raju (@kpradeepraju) April 30, 2022
మరోవైపు.. మెడల్ ప్రదానోత్సవానికి సింధు దూరంగా ఉండటం వల్ల ఆమె కాస్యం తీసుకునేందుకు ఇష్టపడటం లేదనే ఊహాగానాలు వినిపించాయి. అయితే.. ఆ తర్వాత మెడల్‌తో ఉన్న ఫొటోను ట్విట్టర్లో షేర్ చేస్తూ ఆ వాదనలకు చెక్ పెట్టింది సింధు. ఒక ప్రతిష్టాత్మక ఈవెంట్ ముగింపులో పతకం చాలా ముఖ్యమైనదని, ప్రస్తుతం తదుపరి గేమ్‌పై దృష్టి పెట్టినట్లు పేర్కొంది.
-
A medal at the end of an excruciating campaign is always special. This could have gone the distance. Looking forward to the next. ✌️🙌🏼#asianchampionships #bronze🥉 pic.twitter.com/fZH7gGO1Mo
— Pvsindhu (@Pvsindhu1) May 1, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">A medal at the end of an excruciating campaign is always special. This could have gone the distance. Looking forward to the next. ✌️🙌🏼#asianchampionships #bronze🥉 pic.twitter.com/fZH7gGO1Mo
— Pvsindhu (@Pvsindhu1) May 1, 2022A medal at the end of an excruciating campaign is always special. This could have gone the distance. Looking forward to the next. ✌️🙌🏼#asianchampionships #bronze🥉 pic.twitter.com/fZH7gGO1Mo
— Pvsindhu (@Pvsindhu1) May 1, 2022
ఏం జరిగింది?: ఆసియా ఛాంపియన్షిప్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో జపాన్‌కు చెందిన అకానె యమగూచితో తలపడింది సింధు. సుమారు గంటకుపైగా సాగిన పోరులో సింధు 21-13,19-21,16-21 తేడాతో ఓటమిపాలైంది. అయితే, ఈ మ్యాచ్‌లో ఆమెకు తీవ్ర అన్యాయం జరిగినట్లు తెలుస్తోంది. రెండో గేమ్‌లో సింధూ 14-11 తేడాతో ఆధిపత్యంలో ఉన్న సమయంలో రిఫరీ తీసుకున్న తప్పుడు నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తొలి గేమ్‌ను సొంతం చేసుకున్న సింధు రెండో గేమ్‌లో ఆధిపత్యంలో దూసుకుపోతుండగా.. మ్యాచ్ రిఫరీ యమగూచికి ఒక పాయింట్ కేటాయించారు. సింధు సర్వీస్ చేసేటప్పుడు ఎక్కువ సమయం తీసుకుందన్న కారణంతోనే పాయింట్ ఇచ్చినట్లు తెలిసింది. అనంతరం రిఫరీతో సింధు మాట్లాడింది. యమగూచి సిద్ధంగా లేనందునే తాను సమయం తీసుకున్నానని వివరించినా పట్టించుకోలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
ఇదీ చూడండి: ఆసియా ఛాంపియన్షిప్ సెమీస్‌లో సింధు ఓటమి.. కాంస్యంతో సరి