భారత ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) వైస్ ప్రెసిడెంట్ జనార్ధన్ సింగ్ గెహ్లోట్ కన్నుమూశారు. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న 70 ఏళ్ల గెహ్లోట్.. రాజస్థాన్లోని జైపూర్లో తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
"గెహ్లోట్ మృతికి భారత ఒలింపిక్ అసోసియేషన్ తరఫున, నా వ్యక్తిగతంగా సంతాపం తెలుపుతున్నా. ఆయన ఐఓఏ వైస్ ప్రెసిడెంట్గానే కాకుండా రాజస్థాన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగానూ పదవిలో ఉన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని.. ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను."
-నరేందర్ బాత్రా, భారత ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు.
జనార్ధన్ సింగ్ మృతిపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్తో పాటు గవర్నర్ కల్రాజ్ మిశ్రా సంతాపం ప్రకటించారు. రాజకీయాల్లోనూ, క్రీడలలోనూ తనదైన ముద్ర వేశారని సీఎం గుర్తుచేసుకున్నారు.
ఇదీ చదవండి: కోహ్లీ, రాహుల్ స్థానాలు పదిలం.. టాప్-10లోకి రిజ్వాన్
గెహ్లోట్ గతంలో రాజస్థాన్ మంత్రిగానూ పనిచేశారు. కబడ్డీ జాతీయ సమాఖ్యకు ఏకంగా 28 ఏళ్ల పాటు(2013 వరకు) అధ్యక్షుడిగానూ కొనసాగారు. 2017లో ఐఓఏ ఉపాధ్యక్షుడిగా ఎంపికయ్యారు. దీంతో పాటు అంతర్జాతీయ కబడ్డీ సమాఖ్య అధ్యక్షుడిగానూ కొనసాగుతున్నారు.
ఇదీ చదవండి: లంక మాజీ క్రికెటర్ జోయ్సాపై ఆరేళ్ల నిషేధం