ETV Bharat / sports

బల్లెం విసిరితే రికార్డులే.. ఊబకాయాన్ని జయించి స్ఫూర్తిగా నిలిచి..

నీరజ్ చోప్రా.. ఒకప్పుడు అంతగా పరిచయం లేని పేరిది. కానీ టోక్యో ఒలింపిక్స్​లో జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణం గెలిచి అందరి చేత చప్పట్లు కొట్టించాడు. తాజాగా ప్రపంచ అథ్లెటిక్స్​ ఛాంపియన్​షిప్​లో సిల్వర్​ సాధించాడు. అయితే ఈ పతకాలు అతడికి అంత సులువుగా దక్కలేదు. దాని వెనక ఎంతో శ్రమ ఉంది. చోప్రా.. ప్రపంచ అథ్లెటిక్స్​ ఛాంపియన్​షిప్​లో సిల్వర్​ సాధించిన సందర్భంగా అతడి గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

చోప్రా
చోప్రా
author img

By

Published : Jul 24, 2022, 2:07 PM IST

Updated : Jul 24, 2022, 2:23 PM IST

ఒలింపిక్​ గోల్డ్ విజేత నీరజ్​ చోప్రా మరోసారి అదరగొట్టాడు. అమెరికాలో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్​ ఛాంపియన్​షిప్​లో పాల్గొన్న చోప్రా సిల్వర్​ మెడల్​ సాధించాడు. ఒకప్పుడు అసలు పరుగు తీయమంటేనే బద్ధకించే నీరజ్​.. ఇప్పుడు పతకాల వేట కొనసాగిస్తున్నాడు. ఆరోగ్యంపైన శ్రద్ధ పెట్టని ఓ వ్యక్తి దేశం గర్వించే ఛాంపియన్​ అవుతాడని ఊహించారా? కానీ, అదే జరిగింది. అనుకోకుండా ఆడిన ఆటను ఎంతో ఇష్టంగా మార్చుకున్నాడు. ఆ ఆటలో ప్రాణం పెట్టాడు.

ఎందరో క్రీడాకారులకు పుట్టినిల్లు అయిన హరియాణా నుంచి వచ్చిన మరో ఆణిముత్యమే నీరజ్​ చోప్రా. పానీపత్​ జిల్లా ఖంద్రా గ్రామానికి చెందిన 23 ఏళ్ల నీరజ్‌ చోప్రా అతి సామాన్యమైన కుటుంబంలో జన్మించాడు. అతడి తల్లిదండ్రులు సతీస్​ కుమార్​-సరోజ్​ బాల సహా ఇతర కుటుంబసభ్యులు వ్యవసాయంపై ఆధారపడి జీవించేవాళ్లే. చిన్నతనంలో నీరజ్‌ చాలా బద్ధకంగా ఉండేవాడట. దీంతో 12 ఏళ్లకే 90కిలోల బరువు పెరిగాడు. ఇంట్లో వాళ్లు జాగింగ్‌, వ్యాయామం చేయమన్నా ససేమిరా అనేవాడు. ఫిట్‌నెస్‌ గురించి అసలు ఆలోచించేవాడు కాదు.

ఆ ఒక్క ఘటనతో..
కుటుంబం బలవంతం మేరకు ఓసారి నీరవ్‌ స్థానిక శివాజీ స్టేడియంలో జాగింగ్‌ చేయడానికి వెళ్లాడు. అక్కడే అతడికి జావలిన్‌ త్రో ఆటగాడు జై చౌధరీ తారసపడ్డాడు. జావెలిన్‌ త్రోను చేతికిచ్చి విసరమని జై చెప్పగానే భారీకాయంతో కూడా నీరవ్‌ ఎంతో చక్కటి ప్రదర్శన కనబర్చాడట. ఆటపై అసలు ఏ మాత్రం అవగాహన లేకపోయినా తొలిసారే 35-40మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరాడని.. అది ఎంతో గొప్ప విషయమని జై ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అతడి శరీరం ఈ ఆటకు ఎంతో అనువుగా ఉందని, జావెలిన్‌ను విసిరే శైలి ఆకట్టుకునేలా ఉందని పేర్కొన్నాడు.

జై చౌధరీ ఏ క్షణాన జావెలిన్‌ను నీరజ్‌ చేతికి ఇచ్చాడో తెలియదు గానీ.. ఆ ఆటపై నీరజ్‌కు ఆసక్తి పెరిగింది. జావెలిన్‌లో శిక్షణ పొందాలని అప్పుడే నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం వ్యాయామమంటే ఏమాత్రం ఇష్టం లేని నీరజ్‌ బరువు తగ్గడానికి సిద్ధపడ్డాడు. ఊహించని ఈ మార్పుతో అతడి కుటుంబసభ్యులు ఒకవైపు ఆశ్చర్యపోయినా.. అతడి ఇష్టాన్ని కాదనలేకపోయారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. నీరజ్‌ శిక్షణకు కావాల్సినవన్నీ సమకూర్చారు.

కెరీర్‌ మొదలైందిలా..
ఒకవైపు చదువును కొనసాగిస్తూనే నీరజ్‌ 2013లో ప్రపంచ యూత్‌ ఛాంపియన్‌షిప్‌, 2015లో ఏషియన్‌ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్నాడు. పతకాలు రాకున్నా.. మంచి ప్రదర్శనే చేశాడు. 2016 నుంచి నీరజ్‌ కెరీర్‌.. పతకాలు, రికార్డులతో విజయ పథంలో పరుగులు తీస్తోంది. ఆ ఏడాదిలో జరిగిన సౌత్‌ ఏషియన్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం, ఏషియన్‌ జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం గెలిచాడు. వరల్డ్‌ అండర్‌ 20 ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలవడమే కాదు.. జావెలిన్‌ను 86.48మీటర్లు దూరం విసిరి ప్రపంచ రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ పోటీల్లో మొత్తంగా ఏడు స్వర్ణ పతకాలు, నాలుగు రజత పతకాలు, ఒక కాంస్య పతకం సాధించి అగ్రశ్రేణి ఆటగాడిగా అవతరించాడు. 2018లో గోల్డ్‌కోస్ట్‌ కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో స్వర్ణం గెలిచిన తర్వాత కేంద్రం నీరజ్‌ను అర్జున అవార్డుతో సత్కరించింది.

పోటీలోనే బెస్ట్‌..: "జావెలిన్‌ క్రీడాకారుడికి బలంతో పాటు ఫ్లెక్సిబిలిటీ, వేగం ఉండాలి. ఈటె విసిరినపుడు భుజాన్నీ, మోచేయినీ ఎక్కువగా ఉపయోగిస్తాను. నా వ్యాయామాలు వీటి దృఢత్వాన్ని పెంచేలా ఉంటాయి. కొన్నిసార్లు గాయాలూ అవుతాయి. ప్రాక్టీసు ఎక్కువ, తక్కువ కాకుండా చూసుకోవాలి. వీటితోపాటు రన్నింగ్‌, జంప్స్‌, బరువులు ఎత్తడం చేస్తా. యోగా ధ్యానం కూడా చేస్తాను. శిక్షణ సమయంలోనే పోటీకి అన్ని విధాలా సిద్ధమవుతా. పోటీ అనేసరికి ఇంకా ఉత్సాహం వస్తుంది. చాలాసార్లు నా బెస్ట్‌ పోటీల్లోనే నమోదవుతుంది." అని చోప్రా చెప్పుకొచ్చాడు.

ఫోన్‌కు దూరంగా..: పోటీలు సిద్ధమవుతున్నప్పుడు సోషల్​ మీడియాకు దూరం ఉంటానన్నాడు నీరజ్. ఇతరులతో మాట్లాడేకొద్దీ పతకం తేవాలనే మాటలు పదే పదే వినిపించి ఒత్తిడికి గురిచేస్తాయని.. అందుకే పోటీలు జరిగినప్పుడు ఫోన్‌ పక్కన పడేసి పూర్తిగా శిక్షణమీదా, వ్యూహాలమీదా దృష్టిపెడతానని అన్నాడు.

స్వీట్లు ఇష్టం..: స్వీట్లు బాగా ఇష్టమని కానీ క్రీడాకారుడిగా మారాక తగ్గించేశానని చెప్పుకొచ్చాడు నీరజ్. "ఒలింపిక్స్‌కు ఆరు నెలల ముందు నుంచీ స్వీట్లు తినడం మానేశా. ఎప్పుడైనా టోర్నీ ముగిశాక విరామంలో తింటుంటా. అమ్మచేసే చూర్మా (రోటీలో పంచదార, నెయ్యి వేసి చేస్తారు), దూధ్‌ పేడా అంటే బాగా ఇష్టం. స్ట్రీట్‌ఫుడ్‌లో పానీపూరీ ఇష్టం. రోజులో ఎక్కువగా సలాడ్లూ, పండ్ల రసాలూ, బ్రెడ్‌ ఆమ్లెట్‌, సాల్మన్‌ ఫిష్‌... తీసుకుంటా. వీటితో బోర్‌ కొడితే ఫ్రైడ్‌రైస్‌ చేసుకుని తింటుంటా." అని ఫుడ్​ టేస్ట్​ గురించి చెప్పాడు.

ఇదీ చూడండి : లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్​పై కీలక నిర్ణయం.. ఇక్కడే నిర్వహించేలా..

Last Updated : Jul 24, 2022, 2:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.