ETV Bharat / sports

ఆసియా రెజ్లింగ్‌లో సాక్షి మాలిక్​కు రజతం - Asian Wrestling Championship 2020 sakshi malik news

ఆసియా రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్​ రెజ్లర్​ సాక్షి మాలిక్ రజతం కైవసం చేసుకుంది​. పసడి ఆశలు రేపిన ఈమె​... ఫైనల్లో నయోమి రుకీ(జపాన్)చేతిలో ఓడింది.

Sakshi Malik
ఆసియా రెజ్లింగ్‌లో సాక్షి మాలిక్​కు రజతం
author img

By

Published : Feb 21, 2020, 10:33 PM IST

Updated : Mar 2, 2020, 3:03 AM IST

రియో ఒలింపిక్స్​లో కాంస్యం సంపాదించిన భారత స్టార్ రెజ్లర్​ సాక్షి మాలిక్​.. ఆ తర్వాత జరిగిన పలు టోర్నీల్లో నిరాశపర్చింది. తాజాగా దిల్లీలో జరుగుతున్న ఆసియా రెజ్లింగ్​ ఛాంపియన్​షిప్​లో రజతం గెలిచి సత్తా చాటింది. నయోమి రుకీ(జపాన్​) చేతిలో శుక్రవారం జరిగిన బౌట్​లో 65 కేజీల విభాగం ఫైనల్లో పోరాడి ఓడిపోయింది సాక్షి. ఇదే రోజు పలు విభాగాల్లో వినేశ్​ ఫొగాట్​, అన్షు మాలిక్​ కాంస్యం గెల్చుకున్నారు.

ముందురోజు 3 స్వర్ణాలు

గురువారం ఒక్కరోజే భారత క్రీడాకారిణులు మూడు స్వర్ణాలతో పాటు ఓ రజతం కైవసం చేసుకున్నారు. దివ్య కక్రాన్‌ (68 కేజీలు), పింకీ (55 కేజీలు), సరిత మోర్‌ (59 కేజీలు) బంగారు పతకాలు నెగ్గారు. నిర్మల దేవి (50 కేజీలు) రజతంతో సరిపెట్టుకుంది. నవ్‌జోత్‌ కౌర్‌ (2018) తర్వాత ఆసియా రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణాలు గెలిచిన మహిళా రెజ్లర్లుగా దివ్య, పింకీ, సరిత చరిత్ర సృష్టించారు.

Last Updated : Mar 2, 2020, 3:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.