ETV Bharat / sports

సునీల్​ ఛెత్రి@ 85.. టాప్​-5లో భారత్‌ ఫుట్‌బాల్‌ స్టార్! - సునీల్​ ఛెత్రి ఇంటర్నేషనల్​ ఫుట్​బాల్​

భారత ఫుట్​బాల్​ జట్టు కెప్టెన్​ సునీల్​ ఛెత్రి ఓ అరుదైన రికార్డును సాధించాడు. ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్‌ చేసిన ఆటగాళ్ల జాబితాలో సునీల్ ఐదో స్థానానికి చేరుకున్నాడు. ఆ వివరాలు..

sunil chhetri
sunil chhetri
author img

By

Published : Mar 29, 2023, 9:32 AM IST

ఫుట్‌బాల్‌లో స్టార్‌ ఆటగాడు, భారత్​ జట్టు కెప్టెన్‌ సునీల్ ఛెత్రి వ్యక్తిగతంగా రికార్డుల మీద రికార్డులు సాధిస్తూనే ఉన్నాడు. తాజాగా ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్‌ చేసిన ఆటగాళ్ల జాబితాలో సునీల్ ఛెత్రి ఐదో స్థానానికి చేరుకున్నాడు. ముక్కోణపు అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌లో భాగంగా మంగళవారం కిర్గిజ్‌ రిపబ్లిక్‌తో జరిగిన మ్యాచ్‌లో గోల్‌ కొట్టడం ద్వారా సునీల్‌ ఛెత్రి అంతర్జాతీయ కెరీర్‌లో 85వ గోల్‌ నమోదు చేశాడు.

ఈ నేపథ్యంలో హంగేరీకి చెందిన ఫెరెన్క్‌ ఫుకాస్‌(85 మ్యాచ్‌ల్లో 84 గోల్స్‌)ను అధిగమించి టాప్‌-5లోకి అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు 133 మ్యాచ్‌లాడిన సునీల్‌ ఛెత్రి 85 గోల్స్‌ నమోదు చేశాడు. ఇక తొలి స్థానంలో క్రిస్టియానో రొనాల్డో- పోర్చుగల్‌(198 మ్యాచ్‌ల్లో 122 గోల్స్‌) ఉండగా.. రెండో స్థానంలో అలీ దాయి- ఇరాన్‌(148 మ్యాచ్‌ల్లో 109 గోల్స్‌), అలీ దాయి- ఇరాన్‌(148 మ్యాచ్‌ల్లో 109 గోల్స్‌) మూడో స్థానంలో, మొక్తర్‌ దహారి- మలేసియా (142 మ్యాచ్‌ల్లో 89 గోల్స్‌) నాలుగో స్థానంలో ఉన్నారు.

sunil chhetri
.

ఇక ముక్కోణపు అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌లో ఆతిథ్య భారత జట్టు విజేతగా నిలిచింది. మణిపుర్‌లో మంగళవారం జరిగిన రెండో లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 2–0 గోల్స్‌ తేడాతో కిర్గిజ్‌ రిపబ్లిక్‌ జట్టుపై గెలిచింది. భారత్‌ జట్టు తరఫున సందేశ్‌ జింగాన్‌ (34వ ని.లో), సునీల్‌ ఛెత్రి (84వ ని.లో) ఒక్కో గోల్‌ చేశారు. సునీల్‌ ఛెత్రి కెరీర్‌లో ఇది 85వ గోల్‌ కావడం విశేషం. ఈ టోర్నీలో ఆడిన మరో జట్టు మయన్మార్‌పై తొలి లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 1–0 తో విజయం సాధించింది.

తాజాగా ఫుట్​బాల్​ స్టార్​ రొనాల్డో కూడా ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు. తమ దేశం తరపున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన తొలి ఆటగాడిగా చరిత్రకెక్కాడు. జర్మనీ వేదికగా జరుగుతున్న యూరోకప్‌ 2024 క్వాలిఫయర్‌లో భాగంగా గురువారం లిచెన్‌స్టెయిన్, పోర్చుగల్‌ మధ్య జరిగిన మ్యాచ్​లో ఈ రికార్డును సృష్టించాడు. ఇది ఆయన 197వ మ్యాచ్​ కావడం విశేషం. అయితే ఇది వరకు ఈ రికార్డు కువైట్‌కు చెందిన బాదర్ అల్-ముతావా పేరిట ఉండేది. అప్పట్లో 196 మ్యాచ్‌లతో ఆయనతో సమానంగా ఉన్న రొనాల్డో ఈ మ్యాచ్​తో ఆ మార్క్​ను దాటి ముందంజలో ఉన్నాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.