Malaysia Masters 2023 winner : మలేసియా మాస్టర్స్ 2023 టోర్నీలో భారత స్టార్ షట్లర్ హెచ్‌ఎస్ ప్రణయ్ సంచలనం సృష్టించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో విజేతగా నిలిచాడు. 21-19, 13-21, 21-18 తేడాతో చెనా షట్లర్ వెంగ్ హాంగ్ యాంగ్‌ను ఓడించాడు. దీంతో తొలి వరల్డ్ టూర్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ట్రోఫీని అందుకోవడంతో పాటు రూ. 25 లక్షల ప్రైజ్ మనీని అందుకున్నాడు. ఈ ఏడాది.. అతడికి ఇదే తొలి ఏటీపీ టైటిల్. గంటా 31 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో విజయం కోసం అతడు తీవ్రంగా శ్రమించాడు. మొదటి సెట్లో గెలిచి.. ఆ తర్వాత ఓడినా.. మూడో సెట్లో తన అద్భుత ప్రదర్శనతో ఈ ఘనత సాధించాడు. పీవీ సింధు, శ్రీకాంత్ లాంటి స్టార్ ప్లేయర్స్ చేతులేత్తేసిన ఈ టోర్నీలో.. అతడు టైటిల్‌ను ముద్దాడటం విశేషం.
-
#MalaysiaMasters2023 𝓼𝓽𝓪𝓽 𝓸𝓯 𝓽𝓱𝓮 𝓭𝓪𝔂@PRANNOYHSPRI 🇮🇳 is the first male shuttler from India to play in a title match since the tournament started in 2⃣0⃣0⃣9⃣.#BWFWorldTour pic.twitter.com/2beoOgK64G
— BWF (@bwfmedia) May 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#MalaysiaMasters2023 𝓼𝓽𝓪𝓽 𝓸𝓯 𝓽𝓱𝓮 𝓭𝓪𝔂@PRANNOYHSPRI 🇮🇳 is the first male shuttler from India to play in a title match since the tournament started in 2⃣0⃣0⃣9⃣.#BWFWorldTour pic.twitter.com/2beoOgK64G
— BWF (@bwfmedia) May 28, 2023#MalaysiaMasters2023 𝓼𝓽𝓪𝓽 𝓸𝓯 𝓽𝓱𝓮 𝓭𝓪𝔂@PRANNOYHSPRI 🇮🇳 is the first male shuttler from India to play in a title match since the tournament started in 2⃣0⃣0⃣9⃣.#BWFWorldTour pic.twitter.com/2beoOgK64G
— BWF (@bwfmedia) May 28, 2023
ఫస్ట్ సెట్ సాగిందిలా..
Malaysia Masters 2023 HS Prannoy : ప్రణయ్-వెంగ్ హాంగ్.. డ్రాప్ షాట్లు, సుదీర్ఘ ర్యాలీలు, స్మాష్‌లతో హోరాహోరీగా తలపడ్డారు. ప్రతీ పాయింట్ కోసం ఇద్దరూ పోటాపోటీగా తలపడ్డారు. అయితే ప్రణయ్ తన అసాధారణ ఆటతో ఆధిపత్యం చెలాయించి ఫస్ట్ సెట్లో 21-19తేడాతో గెలుపొందాడు. ఈ సెట్ 31 నిమిషాల పాటు సాగింది.
సెకండ్ సెట్ సాగిందిలా.. అయితే రెండో గేమ్‌లో మాత్రం చైనా షట్లర్ దీటుగా బదులిచ్చాడు. పదునైన స్మాష్ లు, డ్రాప్ షాట్లలతో ప్రణయ్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. దీంతో వార్ వన్‌సైడ్ అయిపోయింది. భారత షట్లర్ ప్రణయ్ తప్పిదాలు చేయగా.. యాంగ్ జోరును కొనసాగించి రెండో గేమ్‌ను 13-21 తేడాతో సొంతం చేసుకున్నాడు. రెండో సెట్ 26 నిమిషాల పాటు కొనసాగింది.
మూడో సెట్ సాగిందిలా.. మూడో సెట్లో ప్రణయ్-వెంగ్.. ప్రతి పాయింట్ కోసం హోరాహోరీగా పోటీపడ్డారు. మెదట్లో వెంగ్ దూకుడు ప్రదర్శించినా.. ఆ తర్వాత అప్రమత్తమైన ప్రణయ్.. పదునైన స్మాష్‌లతో ఆకట్టుకున్నాడు. సుదీర్ఘ ర్యాలీలు జరిగాయి. ఇద్దరి మధ్య ఆధిపత్యం దోబుచులాడింది. ఆఖర్లో 18-18 తేడాతో ఇద్దరూ సమంగా కూడా నిలిచారు. అనంతరం చెలరేగిన ప్రణయ్ ఒకేసారి వరుసగా రెండు పాయింట్లను తన ఖాతాలోకి వేసుకుని 20-18తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. చివరికి 21-18తో మూడో సెట్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ మూడో సెట్ 34 నిమిషాల పాటు సాగింది.
నిరాశ పరిచిన సింధు, శ్రీకాంత్
Malaysia Masters 2023 PV Sindhu : మలేషియా మాస్టర్స్‌లో ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు, తెలుగు కుర్రాడు కిదాంబి శ్రీకాంత్ నిరాశపరిచారు. మహిళల సింగిల్స్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగి ఆశలు రేపిన సింధు.. సెమీఫైనల్లో ఓటమిని అందుకుని ఇంటికి వెళ్లింది. ఇండోనేషియా ప్లేయర్ జార్జియా మరిస్కా తుంజంగ్ చేతిలో 14-21,17-21తో ఓడిపోయింది. ఇకపోతే శ్రీకాంత్.. క్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించాడు.
ఇదీ చూడండి:
Malaysia Masters 2023 : పీవీ సింధుకు నిరాశ.. ఫైనల్స్‌కు చేరిన ప్రణయ్