భారత మహిళా బాక్సర్లు ప్రపంచ వేదికపై సత్తా చాటుతున్నారు. రష్యాలోని ఉలాన్ ఉద్ వేదికగా జరగుతున్న వరల్డ్ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో క్వార్టర్స్ చేరారు. బుధవారం జరిగిన ప్రీ క్వార్టర్స్‌లో జమునా, లవ్లీనా అద్భుత ప్రదర్శన చేశారు. వీరిద్దరినీ అభినందిస్తూ ట్వీట్లు చేశారు క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజుజు.
టాప్-5 సీడ్‌నే...
ప్రపంచ ఐదో సీడ్ ఒయిదాద్(అల్జీరియా)కు షాకిచ్చింది జమునా బోరో. బుధవారం జరిగిన 54 కేజీల విభాగం ప్రీ క్వార్టర్స్‌లో పోటీపడిన ఈ బాక్సర్... 5-0 తేడాతో గెలిచింది. గురువారం జరగనున్న క్వార్టర్ ఫైనల్లో యులియా(బెలారస్)పై విజయం సాధించి.. కెరీర్లో తొలి ప్రపంచ పతకం ఖాయం చేసుకోవాలనుకుంటోంది జమునా.
-
A great beginning by Jamuna Boro with a 5️⃣-0️⃣ first round win at AIBA Women World Boxing Championship at Ulan Ude, Russia.#PunchMeinHaiDum https://t.co/ZKr5tp3kiX pic.twitter.com/XJwtleEMNg
— Kiren Rijiju (@KirenRijiju) October 4, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">A great beginning by Jamuna Boro with a 5️⃣-0️⃣ first round win at AIBA Women World Boxing Championship at Ulan Ude, Russia.#PunchMeinHaiDum https://t.co/ZKr5tp3kiX pic.twitter.com/XJwtleEMNg
— Kiren Rijiju (@KirenRijiju) October 4, 2019A great beginning by Jamuna Boro with a 5️⃣-0️⃣ first round win at AIBA Women World Boxing Championship at Ulan Ude, Russia.#PunchMeinHaiDum https://t.co/ZKr5tp3kiX pic.twitter.com/XJwtleEMNg
— Kiren Rijiju (@KirenRijiju) October 4, 2019
బలమైన ప్రత్యర్థి...
69 కేజీల విభాగంలో పోటీపడిన లవ్లీనా... మొరాకో క్రీడాకారిణి బెల్ అబీబ్కు పంచ్ ఇచ్చింది. తర్వాతి మ్యాచ్‌లో తన కంటే బలమైన ప్రత్యర్థి 6వ సీడ్ కరోలినా(పోలండ్)తో పోటీపడనుంది.
-
Congratulations to amazing @LovlinaBorgoha1 for reaching quarter finals at the Women's World #Boxing C’ships in Russia. #PunchMeinHaiDum pic.twitter.com/AkVbrhLOKe
— Kiren Rijiju (@KirenRijiju) October 9, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Congratulations to amazing @LovlinaBorgoha1 for reaching quarter finals at the Women's World #Boxing C’ships in Russia. #PunchMeinHaiDum pic.twitter.com/AkVbrhLOKe
— Kiren Rijiju (@KirenRijiju) October 9, 2019Congratulations to amazing @LovlinaBorgoha1 for reaching quarter finals at the Women's World #Boxing C’ships in Russia. #PunchMeinHaiDum pic.twitter.com/AkVbrhLOKe
— Kiren Rijiju (@KirenRijiju) October 9, 2019
6సార్లు ప్రపంచ ఛాంపియన్ మేరీకోమ్ కూడా ఇదే టోర్నీలో క్వార్టర్స్ చేరింది. 51 కేజీల విభాగంలో జుటామస్(థాయ్‌లాండ్) క్రీడాకారిణిపై ఆమె గెలుపొందింది. మంజురాణి(48 కేజీలు) , వితా చాహల్(81 కేజీల) ఇప్పటికే క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టారు.