ETV Bharat / sports

మహిళల ఆసియా ఛాంపియన్స్​ ట్రోఫీ విజేతగా భారత్​ - ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత మహిళలు

India Wins Womens Asian Hockey Championship 2023 : మహిళల ఆసియా హాకీ ఛాంపియన్స్​ ట్రోఫీలో భారత జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్స్​లో 4-0 గోల్స్​ తేడాతో జపాన్​ను ఓడించి టైటిల్​ సాధించింది.

India Wins Womens Asian Hockey Championship 2023

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 6, 2023, 7:16 AM IST

Updated : Nov 6, 2023, 10:17 AM IST

India Wins Womens Asian Hockey Championship 2023 : ఝార్ఖండ్​ వేదికగా జరిగిన మహిళల ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీని భారత్​ కైవసం చేసుకుంది. ఆదివారం రాంచీలో జరిగిన ఫైనల్​లో 4-0 గోల్స్​ తేడాతో జపాన్​ జట్టును చిత్తు చేసింది. 17వ నిమిషంలో సంగీత చేసిన గోల్​తో అధిక్యంలోకి వెళ్లిన భారత​ జట్టు.. అనంతరం దూకుడు పెంచింది. ఈ క్రమంలో కొన్ని గోల్స్​ తప్పిపోయాయి. కానీ నేహా (46వ), లాల్​రెమ్​సియామి (57వ), వందన కటారియా (60వ) గోల్స్​ చేయడం వల్ల భారత్​ ఘన విజయం సాధించింది. ఈ టోర్నీలో ఆడిన 7 మ్యాచ్​ల్లోనూ భారత్​ గెలవడం గమనార్హం. ఇక ఫైనల్​లో ఓడిపోయి జపాన్​ రెండో స్థానంలో నిలిచింది. ప్లేఆఫ్స్​లో సౌత్​కొరియాను 2-1 గోల్స్​ తేడాతో చిత్తు చేసిన చైనా.. మూడో స్థానానికి పరిమితమైంది.

రాంచీలోని హాకీ స్టేడియంలో నాలుగు ఫ్లడ్​లైట్లలో ఒకటి మొరాయించడం వల్ల ఫైనల్​ మ్యాచ్​ 50 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. టీమ్ ఇండియా మొదటి నుంచే ఆధిపత్యం కనబర్చింది. స్టాండ్స్​లో ఉన్న హాకీ పురుషుల జట్టు మహిళల జట్టు కేరింతలు కొడుతూ ఉత్సాహాన్ని ఇచ్చారు.

  • Jharkhand Women's Asian Champions Trophy Ranchi 2023 | India wins the title, beats defending champion Japan by 4-0.

    (Video Source: Hockey India/Twitter) pic.twitter.com/34ShmQPJtn

    — ANI (@ANI) November 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇది రెండోసారి..
మహిళల ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీని భారత్‌ గెలవడం ఇది రెండోసారి. 2016లో భారత జట్టు మొదటిసారి ఈ టైటిల్‌ను సాధించింది. కాగా ఈ ట్రోఫీని కైవసం చేసుకున్న భారత జట్టుకు హాకీ ఇండియా నజరానా ప్రకటించింది. జట్టులోని ప్రతి సభ్యురాలికి రూ.3 లక్షలు చొప్పున అందజేస్తామని తెలిపింది. ఇక సపోర్ట్​ స్టాఫ్​కు రూ. 1.5 లక్షల చొప్పున ఇస్తామని చెప్పింది.

టోర్నమెంట్ అవార్డులు..
ఈ టోర్నమెంట్​లో ఎక్కువ గోల్స్​ సాధించిన టీమ్​గా భారత్​ (27 గోల్స్) అవార్డ్ అందుకుంది. ఇక రైసింగ్​ ప్లేయర్​గా అవార్డు సంగీత కుమారి సాధించింది. బెస్ట్​ రైసింగ్ గోల్​కీపర్​ అవార్డును సౌత్​ కొరియాకు చెందిన కిమ్​ ఎంజీ (Kim Eunji ) సొంతం చేసుకుంది. బెస్ట్ గోల్​ కీపర్​ అవార్డును జపాన్​ ప్లేయర్ అకినో తనకా అందుకుంది. ఫ్యాన్​ ఛాయిస్ బెస్ట్​ గోల్ అవార్డును భారత ప్లేయర్ దీపిక సొంతం చేసుకుంది.

Asian Champions Trophy 2023 : భారత హాకీ జట్టుకు రివార్డులే రివార్డులు.. ఎన్ని కోట్లు వచ్చాయంటే?

Asian Games Ind Vs Pak : ఉత్కంఠ పోరులో పాక్​పై భారత్ ఘన విజయం.. స్వర్ణ పతకం కైవసం

Last Updated : Nov 6, 2023, 10:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.