ETV Bharat / sports

శ్రీకాంత్​ సహా ఏడుగురు భారత ఆటగాళ్లకు కరోనా.. టోర్నీ నుంచి అవుట్​

India Open 2022: ఇండియా ఓపెన్​ బ్యాడ్మింటన్​ టోర్నీలో పాల్గొనాల్సిన భారత్​కు చెందిన ఏడుగురు ఆటగాళ్లకు కరోనా సోకింది. దీంతో వాళ్లు టోర్నీనుంచి తప్పుకున్నట్లు ప్రపంచ బ్యాడ్మింటన్​ ఫెడరేషన్(బీడబ్ల్యూఎఫ్​) తెలిపింది.

India Open 2022
ఇండియా ఓపెన్​ బ్యాడ్మింటన్​ టోర్నీ
author img

By

Published : Jan 13, 2022, 10:12 AM IST

Updated : Jan 13, 2022, 12:27 PM IST

India Open 2022: ఇండియా ఓపెన్​ బ్యాడ్మింటన్​ టోర్నీ- 2022లో కొవిడ్-19 కలకలం రేపింది. భారత్​కు చెందిన ఏడుగురు బ్యాడ్మింటన్ ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. ఈ క్రమంలో వారు టోర్నీనుంచి తప్పుకున్నట్లు ప్రపంచ బ్యాడ్మింటన్​ ఫెడరేషన్(బీడబ్ల్యూఎఫ్​) తెలిపింది.

కరోనా బారిన పడ్డవారిలో కిదాంబి శ్రీకాంత్​, అశ్విని పొన్నప్ప, రిథికా రాహుల్, థెరిసా జాలీ, మిథున్​ మంజునాథ్​, సిమ్రాన్ అమన్​ సింగ్​, కుషి గుప్తాలు ఉన్నారు.

"ఆటగాళ్లకు మంగళవారం నిర్వహించిన ఆర్​టీ- పీసీఆర్ పరీక్షలో ఏడుగురికి పాజిటివ్​గా తేలింది. ఈ క్రమంలో ఏడుగురితో సన్నిహిత సంబంధాలున్న ఆటగాళ్లనూ టోర్నీ నుంచి తప్పుకున్నాం. కరోనా సోకిన ప్లేయర్స్​కు బదులు ఎవరినీ తీసుకోం. ప్రత్యర్థి ఆటగాళ్లను తదుపరి రౌండ్​కు పంపిస్తాం." అని బీడబ్ల్యూఎఫ్ ఒక ప్రకటనలో ఉంది.

గురువారం తెల్లవారుజామున బీడబ్ల్యూఎఫ్​ ఈ విషయాన్ని తెలిపింది. కానీ కొవిడ్ సోకిన ప్లేయర్స్ లిస్ట్​ మాత్రం వెల్లడించలేదు.

ప్రపంచ బ్యాడ్మింటన్​ ఫెడరేషన్, బ్యాడ్మింటన్​ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు ప్రతిరోజూ ఆటగాళ్లకు కొవిడ్​-19 టెస్టులు నిర్వహిస్తున్నారు.

ఇండియా ఓపెన్​ బ్యాడ్మింటన్​ టోర్నీలో భాగంగా రెండో రౌండ్ గురువారం నుంచి ప్రారంభం కానుంది.

ఇదీ చూడండి: India Open 2022: సింధు, శ్రీకాంత్‌ శుభారంభం

Last Updated : Jan 13, 2022, 12:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.